జులై 30 కాదు....అక్టోబర్ 23న రాకీ రచ్చ

August 07, 2020

కేజీఎఫ్....ఏ మాత్రం అంచనాలు లేకుండా కన్నడలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపుగా అన్ని దక్షిణాది భాషల్లో విడుదలైన ఈ చిత్రం...బాక్సాఫీస్ బద్దలయ్యే కలెక్షన్లను రాబట్టింది. పాన్ ఇండియా మూవీగా పేరు తెచ్చుకున్న కేజీఎఫ్ సీక్వెల్ కెోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `ఆర్ఆర్ఆర్` విడుదల వాయిదాపడడంతో ఈ ఏడాది జులై 30న ఈ సినిమా విడుదల కాబోతోందని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్-2` విడుదల తేదీని అఫీషియల్ గా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించాడు. అక్టోబర్ 23న నరాచీ గేట్లు తెరుచుకోబోతున్నాయంటూ ప్రశాంత్ నీట్ ట్వీట్ చేశాడు. 

అండర్ డాగ్ గా విడుదలై కన్నడ చిత్రం కేజీఎఫ్...ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలై పాన్ ఇండియన్ సినిమా అంటే ఇది అనేలా పేరు తెచ్చుకుంది. కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా....బయ్యర్ల పాలిట బంగారు గనిలా మారింది. కేజీఎఫ్-1 అంచనాలకు మించి హిట్ కావడంతో....కేజీఎఫ్-2 మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. బాహుబలి-2 కోసం ఇండియా మొత్తం ఏ తరహాలో ఎదురుచూసిందో...అదే విధంగా కేజీఎఫ్-2లో రాకీ ఏం చేయబోతున్నాడో తెలుసుకునేందుకు మూవీ బఫ్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. `మే ఐ కమిన్` అంటూ రాకీ గన్ పట్టుకున్న పోస్టర్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు, ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.