పీవీపీ... జగన్ కి జ్వరం తెప్పించాడు !

August 12, 2020

కింగ్ జార్జి ఆస్పత్రి (kGH) ఉత్తరాంధ్రలో చాలా ఫేమస్. విశాఖపట్నంలో ఉన్న ఈ ఆస్పత్రిలోనే ఎల్జీ పాలిమర్స్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన అనంతరం ఆరోజు సాయంత్రం జగన్ బాధితులను పరామర్శించడానికి కింగ్ జార్జి ఆస్పత్రికి వెళ్లారు. ఇది ఒక ముఖ్యమంత్రి కనీస బాధ్యత. దానిని ఆయన నిర్వర్తించారు. దీనిని భారీగా ఎలివేట్ చేద్దామని పీవీపీ చేసిన ప్రయత్నం బ్యాక్ ఫైర్ అయ్యిందని చెబుతున్నారు.

కింగ్ జార్జి ఆస్పత్రికి పదవిలో ఉన్నవారు వెళితే వారికి ఆ పదవి ఊడిపోతుందని సెంటిమెంట్ ఉందట. ఎన్టీఆర్ అప్పట్లో అక్కడికి వెళ్లిన అతికొద్ది కాలంలో పదవి కోల్పోయాడట. తర్వాత రీసెంట్గా చంద్రబాబు హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న కామినేని కూడా కేజీహెచ్ కి వెళ్లి బస చేసి ఆ వెంటనే తన పదవి కోల్పోయాడట. అందుకే నాయకులు ఎవరూ ఆ ఆస్పత్రికి వెళ్లరు అని చెబుతుంటారు. జగనన్న జనం మనిషి కాబట్టి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాడని, జగన్ కి అన్నిటికన్నా ప్రజలే ముఖ్యమని పీవీ ఎలివేషన్ వేయబోయాడు.

విచిత్రం ఏంటంటే.... ఆయన పార్టీ వారే పీవీని విమర్శించారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా చెప్పిన పీవీపీకి అదే ట్వీట్ కి రిప్లై ఇస్తూ వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంటే ఇపుడు జగన్ పదవి పోవాలని కోరుకుంటున్నావా? అని కొందరంటే... జగన్ పదవి పోతుందని చెబుతున్నావా? నీకు బుద్ధుందా? అని ఇంకొందరు తిట్టారు. 

ఈ పీవీపీ టెంపరరీ ట్వీట్ పొలిటీషియన్. జనంలో ఉండరు. కేవలం సినీ జనంలో మాత్రమే తిరుగుతారు. బెజవాడ ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీవీపీ... టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని చేతిలో ఓటమిపాలయ్యారు. అపుడపుడు పొలిటికల్ ట్వీట్లు వేస్తారు. కానీ యాక్టివ్ పొలిటీషియన్ గా ఆయనకు పేరు లేదు. 

సొంత పార్టీ నేతలతో పాటు ఏకంగా జగన్ ను కూడా ఇబ్బంది పెట్టేలా పీవీపీ గతంలోనూ ఓ సారి ట్వీట్ వదిలారు. తాజాగా జగన్ ధైర్యాన్ని ప్రస్తావిస్తూ చేసిన ఈ ట్వీట్ లోనూ జగన్ కు పదవీ గండం పొంచి ఉందన్న మాటను ప్రస్తావించడం చూసి జగన్ అభిమానులే కాదు పార్టీ పెద్దలు కూడా తిట్టారట. ఏమయ్యా... ఎపుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు? నువ్వు పెంచుతున్నావా? తుంచుతున్నావా? అని నిలదీశారట. ఇలాంటి సెంటిమెంట్లు ఒకసారి మనసులో పడితే అది గుర్తుండిపోయే వరుస తప్పులు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటివి ప్రస్తావించకూడదు అని క్లాస్ పీకారట. 

ఇంత జరిగాక జగన్ కు విషయం తెలియకుండా ఉంటుందా? ఏంటి దాని సంగతి అని ఆరాతీశారట. జాతకాలు కూడా చూయించారట. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే... ఎన్నికల ముందే... సెప్టెంబరు 2020 వరకు జగన్ కి బ్యాడ్ డేస్ నడుస్తుంటాయని, గండాలు ఉంటాయని అన్నారట. పరిస్తితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. 

ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన బాల జ్యోతిషుడు అభిజ్ఝ ఆనంద్ కూాడా కరోనాకు ఏపీ ఎక్కువ ప్రభావితం అవుతందని చెప్పారట. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి.