ట్విట్టరు ను షేక్ చేసిన #YSRCOMEDY

May 26, 2020

నెటిజన్లు చాలా యాక్టివ్ గా ఉంటారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు ఇంతకుముందు లాగా ఏమరపాటుగా ఉండి ఏదైనా నోరు జారితే నెటిజన్లు ఆ రోజు ట్రోల్స్ తో పండగ చేస్తారు. నిన్న వైసీపీ వైఎస్ ను కీర్తించబోయి, బాబు ను డ్యామేజ్ చేయబోయి బొక్క బోర్లా పడింది. కియా మోటార్స్ చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. అది చరిత్రలో నిలిచిపోయేది కూడా. అది ఎలాగైనా చంద్రబాబుకు క్రెడిట్ రాకుండా చేయాలని చాలాకాలం నుంచి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అనేక యు టర్న్ లు చేసింది.

తొలుత విజయసాయిరెడ్డి కియా చైనాలో మూతపడింది. అలాంటి పనికిరాని కంపెనీని ఏపీకి తెచ్చి అంత ఖరీదైన భూమి, అన్ని ప్రోత్సహకాలు ఇస్తారా ? అంటూ గతంలో సాయిరెడ్డి బాబుపై ట్వీట్ వేశారు. ఎన్నికల ముందు జగన్ కి ఉన్న బిజీలో సాయిరెడ్డి ట్వీట్లన్నీ చదవడం కష్టం కదా. అందుకే ఈ విషయం తెలియక కియా మోడీ తెచ్చాడు. మోడీ దక్షిణాఫ్రికా వెళ్లి ఏపీ కోసం పట్టుకొచ్చాడు అంటూ జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన అసలు కియాను ఏపీకి రమ్మని పిలిచింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2007లో ఈ విషయమై వైఎస్ కి కియా వాళ్లు లేఖ రాసినట్టు ఒకటి విడుదల చేశారు. అంతే... ఒక్కసారిగా ట్రోలర్స్ వైసీపీని ఆడేసుకున్నారు. వైఎస్సార్ పై కామెడీ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. #YSRcomedy, #YSRCP_FakeNews  హ్యాష్ టాగ్ లతో ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. 

అందరికీ వస్తున్న ప్రధానమైన సందేహం ఏంటంటే... చంద్రబాబు కియా నేనే తెచ్చాను అని చెబుతుంటే వైఎస్సార్ క్రెడిట్ అని ఈ విషయం ఐదేళ్ల పాటు చెప్పకుండా ఎందుకున్నారు. అయినా ఇపుడు కియా ఏపీలో ఏర్పాటుకు కీలకమైన వ్యక్తి అప్పట్లో హ్యుందాయ్ లో చాలా చిన్న ఉద్యోగి. అతని హామీకి విలువ ఏముంటుంది? అయినా ఆ లెటర్ లో సంతకం ఎందుకు లేదు.? అందుకే ... అబద్ధాన్ని కూడా అందంగా చెప్పలేకపోయారు అంటూ ట్రోలర్స్ అనేక రకాల మీమ్స్ తో నెట్లో చెలరేగిపోతున్నారు. పైగా అందులో సర్ నేమ్ రెడ్డి గురించి రాసిన వాక్యం మరింత అనుమానాస్పదంగా ఉంది. 

కింద స్లైడ్ షో లో మీమ్స్ ఉన్నాయి.