కియారా మరో తెలుగు సినిమాలో !

August 09, 2020

కియారా అద్వానీ...మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో ఎంతో సంప్రదాయబద్ధంగా నటించిన ఈ అమ్మాయి అందరికీ గుర్తుండిపోయింది.

చాలా పద్దతిగా తెలుగింటి అమ్మాయిలా అనిపించిన ఈ పోరి... ఇపుడు బాలీవుడ్ పాపులర్ సెడ్యూసింగ్ స్టార్. 

ఓ వెబ్ సిరీస్ లో వైబ్రేటర్ సీన్ , ఆ తర్వాత న్యూ --- డ్ ఫొటో షూట్ తో అందరిలో సెగలు రేపిన కియారా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్లో ప్రవేశిస్తోంది.

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గాని చంద్రముఖి 2 లో లీడ్ రోల్ చేయనుందట.

మొదటి పార్టు తీసిన దర్శకుడు పి.వాసు దీనిని కూడా తెరెక్కిస్తున్నారు.

రజనీకాంత్ పాత్రను లారెన్స్, జ్యోతిక పాత్రను కియారా పోషిస్తారట.

ఇప్పటికే జ్యోతిక, సిమ్రాన్ లను ముందు ఈ పాత్ర కోసం సంప్రదించగా వారు తిరస్కరించారు.

ఇపుడు కియారాను అడిగారు. ఆమె ఇంకా నో చెప్పలేదు, ఎస్ చెప్పలేదు.

అంగీకరించేటంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.