అందరినీ సర్ ప్రైజ్ చేసిన మహేష్ హీరోయిన్

February 24, 2020

తాము చేసే పనుల్ని గొప్పగా ప్రాజెక్టు చేసుకోవటానికి వీలుగా సోషల్ మీడియా అందుబాటులోకి రావటం సెలబ్రిటీలకు.. నటులకు.. ప్రముఖులకు వరంగా మారింది. కాకుంటే.. కొన్నిసార్లు వరంగా మారినట్లే.. మరికొన్నిసార్లు శాపంగా మారే ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఈ మాత్రం రిస్క్ తీసుకోకుంటే ఉత్తనే పేరు ప్రఖ్యాతులు రావు కదా?
ఇష్టమో.. ఇమేజ్ బిల్డింగో కానీ కొందరు సినీ ప్రముఖులు తామెంత సింఫుల్ గా ఉంటామన్న విషయాన్ని గొప్పగా చెప్పుకునే కార్యక్రమాన్ని షురూ చేశారు. ఈ మధ్యనే బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఆటోలో జిమ్ కు వెళ్లి అందరిని ఆశ్చర్యపర్చటమే కాదు.. వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. తాజాగా ఆటోలో ప్రయాణించిన లిస్ట్ లో చేరారు తాజా సంచలనం కియారా అడ్వాణీ.
తెలుగులో భరత్ అనే చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అర్జున్ రెడ్డి బాలీవుడ్ వెర్షన్ కబీర్ సింగ్ లో మెరిసి.. యూత్ ను తెగ అట్రాక్ట్ చేసిన కియారా.. తాజాగా షూటింగ్ కోసం తన ఖరీదైన కారులో కాకుండా ఆటోలో జర్నీ చేయటం ఆసక్తికరంగా మారింది. కాకుంటే.. ఆమెతో పాటు కొరియోగ్రాఫర్ షబినా ఖాన్ కూడా ఆటోలో జర్నీ చేశారు.
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు.. నెటిజన్ల నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తోంది. కూల్ గా కనిపిస్తూ.. ఆటో జర్నీని ఎంజాయ్ చేసినట్లుగా వీడియోలని కియారాను చూసినప్పుడు అనిపించక మానదు. కియారా సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు ఆమె ఫ్యాన్స్. తమ అభిమాన నటి మరీ ఇంత సింఫుల్ గా ఉండటంపై వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కాకుంటే.. వైరల్ అవుతున్న ఆమె ఆటో జర్నీ వీడియోను నిశితంగా చూసినప్పుడు మాత్రం.. ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా ఆటో జర్నీఎపిసోడ్ ను సెట్ చేశారా? అన్న భావన కలుగక మానదు. ఒక ప్రముఖురాలు ఆటో జర్నీ చేసినప్పుడు ఉండే ఎగ్జైట్ మెంట్ ఏదీ కనిపించక పోగా.. ఆటో దిగిన వెంటనే.. కారులో వెళ్లేందుకు మక్కువ చూపటం.. అప్పటికే మీడియా ఫోటో గ్రాఫర్లు పెద్ద ఎత్తున చేరుకొని ఉండటం చూస్తుంటే మాత్రం.. ఏదో తేడా కొడుతోందని చెప్పక తప్పదు.