నార్త్ కొరియాకు విముక్తి లేదా?

August 04, 2020

ఇటీవల మీడియా స్వేచ్ఛ గురించి 180 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తూ ఒక నివేదిక వచ్చింది. అందులో 180వ స్థానంలో ఏ దేశం ఉందో తెలుసా... నార్త్ కొరియా.  ఆ స్థానంలో ఉందటే దానర్థం అసలు అక్కడ మీడియా స్వేచ్ఛ జీరో అని. దాన్ని బట్టి అక్కడి సమాచారం మనకు ఏం తెలిసినా గవర్నమెంటుకు నచ్చింది మాత్రమే అని అనుకోవాలి. తాజాగా కిమ్ జోన్ ఉంగ్ చనిపోయాడు అంటూ వచ్చిన గాసిప్స్ అన్నీ తప్పు అని తేలుస్తూ కిమ్ మీడియా ముందుకు కనిపించాడు. అస్వస్తతకు గురైన మాట నిజమే కానీ... కోలుకున్న మాట కూడా నిజమే అంటున్నారు.

బహుశా కిమ్ బతికి ఉన్నాడని తెలియడం వల్లేనేమో... ప్రపంచంలోని ప్రతిదానిపై నోరు పారేసుకునే ట్రంప్  కిమ్ విషయంలో పెద్దగా రియాక్టు అవలేదు. ఆలోచించి స్పందించారు. ఇది మనం గెస్ చేయలేదు గాని .. ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చారు కిమ్. తాజాగా అలాంటి వాటికి పుల్ స్టాప్ పెడుతూ.. ఒక ఎరువుల కంపెనీని సందర్శంచారట. ఈ మేరకు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. ఈ కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్ తో పాటు ఆయన వెంట.. ఆయన్ను నీడలా వెంటాడే అధ్యక్షుల వారి సోదరి కిమ్ యో జోంగ్ కూడా హాజరైందట.

ఈ కార్యక్రమానికి కిమ్ హాజరు కావటంతో అక్కడి వారు ఆశ్చర్యానికి గురైనట్లుగా ఉత్తరకొరియా అధికార మీడియా కేసీఎన్ఏ స్వయంగా వెల్లడించడం విశేషం. ఉత్తర కొరియా మీడియా చెప్పింది నమ్మాలే గాని... మనకు వేరే ఆధారం లేదు. ఒక వీడియో బయట పెట్టినా దాని అథెంటిసిటీ కూడా డౌటే. అందుకేనేమో బహుశా ఈ వార్తల మీద అంతర్జాతీయ మీడియా పెద్దగా స్పందించలేదు. ఇంతకీ కిమ్ గురించి ఇన్ని గాసిప్స్ ఎందుకు వచ్చాయో తెలుసా...  ఏప్రిల్ 11 నుంచి కనిపించకుండా పోయిన ఆయన ఏప్రిల్ 15న జరిగిన తన తాత 108వ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదు.  తాత అంటే ఆయనకు ఎంతో ప్రీతి. ఇంతవరకు ఎపుడూ మిస్ కాలేదు. దానికి మిస్ అయ్యేటప్పటికి ఈ వార్తలు బయటకు వచ్చాయి. 

English note: North Korea president Kim Jong Un re appears in public after long time since apirl 11. Friday kim tours fertilizer factory in Korea.