కిమ్ అవుట్... ఇక ఉత్తర కొరియా లేడీ డాన్ చేతికి?

August 05, 2020

ఎవరు ఎంత కప్పిపుచ్చినా... ఆధునిక నియంత కిమ్ ఇక లేరు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇదే అనిపిస్తోంది. అంతేకాదు... అమెరికన్ మీడియా కోడై కూస్తోంది. అసలు ఇది ఎలా బయటకు వచ్చిందో తెలుసా? 

ఉత్తర కొరియాలో అత్యంత కీలకమైన ఉత్సవం... కిమ్ జోన్ ఉంగ్ తాత గారి జయంతి. ఆ రోజు ఉత్తరకొరియాకు పెద్ద పండగ వంటిది. తన జీవిత కాలంలో కిమ్ ఎపుడూ దానిని మిస్ కాలేదు. అలాంటిది తొలిసారి ఆ వేడుకకు కిమ్ రాలేదు. అంతేకాదు... అక్కడి సైన్యంలోని సైలెన్స్, ప్రభుత్వ వ్యవహారాల్లో మార్పు చూస్తుంటే.. కిమ్ ఇక లేరు అని తెలుస్తోంది. తీవ్రమైన వ్యాధితో కిమ్ చనిపోయినట్లు చెబుతున్నారు. అధి కరోనా కాకపోవచ్చు కానీ ఇంకేదో పెద్ద సమస్య అంటున్నారు. 

తాత జయంతికి నాలుగు రోజుల ముందు ఏప్రిల్ 11న ఆ దేశంలో ఒక కీలక నిర్ణయం జరిగింది. వర్కర్స్ పార్టీ (కిమ్ పార్టీ) పొలిట్ బ్యూరో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా... కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కి ఆల్టర్నేటివ్ లీడర్ పదవి కట్టబెట్టారు. 12న ఆమెతో కలిసి యుద్ధవిమానాలను పరిశీలించారు. ఇది మీడియాలో వచ్చింది. ఆ తర్వాత ఇప్పటికి 10 రోజులైంది. కానీ కిమ్ మీడియా ముందుకు రాలేదు. అతనికి సర్జరీ అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. కానీ సాధారణంగా ప్లాన్ చేసిన సర్జరీ అయితే తాత జయంతి కు ముందు ప్లాన్ చేసేవారు కాదు. ఇంకేదో ఉంది. అది అనుకోకుండా ఏర్పడిన ఎమర్జెన్సీ. సడెన్ గా కలిగిన అస్వస్థత. అది కరోనా అవ్వొచ్చు. లేదా ఇంకా ఏదైనా పెద్దది అవ్వొచ్చు. 

ఉత్తర కొరియా పక్కనే ఉన్న దక్షిణ కొరియా... కిమ్ చనిపోలేదు అని చెబుతోంది. సైన్యంలో అసాధారణ మార్పు కనిపించడం లేదు. చనిపపోయి ఉంటే ఇంకో రకంగా ఉండేదని అంటోంది. 

ఇంతా చూస్తే కిమ్ వయసు ఎంతో తెలుసా? 36 సంవత్సరాలు. ఇతరులను భయపెట్టాలి అనుకునేవాడు ఎక్కువ ఒత్తిడిలో ఉంటాడు. ఎందుకంటే... తనను ఎవరు మట్టుపెడతారో, తనను ఎవరు గమనిస్తున్నారో అని. అలాంటి ఒత్తిడిని మనిషిని చాలా మారుస్తుంది. 36 ఏళ్ల కిమ్ లో మనం 56 ఏళ్ల కిమ్ ను చూస్తుంటాం. దానికి కారణం ఆ ఒత్తిడే. అది తెచ్చిన ఊబకాయం. దానికి తోడు మందు, సిగరెట్... చేతిలో అపరిమిత అధికారం. అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు. తాను ఏమనుకుంటే అదే జరుగుతుంది. అతను 26 ఏళ్ల వయసులో ఉత్తర కొరియా అధ్యక్షుడు అయ్యాడు. అంత చిన్న వయసులో అధికారం దక్కితే ఎంత అహంకారం తలకెక్కుతుందో కిమ్ ను చూస్తేనే మనకు అర్థమవుతుంది. కిమ్ బతికి ఉన్నా ఆశ్చర్యం లేదు కాని..వాతావరణం మాత్రం అలా కనిపించడం లేదు. 

ఇక కిమ్ చెల్లి ... ఇప్పటికే మరో నియంతగా మారినట్టుంది. అసలు ఆ కుటుంబమే అంత. అంటే ఉత్తర కొరియా లేడీ డాన్ చేతికి దక్కనుంది. మరి ఇంకెలాంటి వింతలు చూస్తామో ఆమె ఆధ్వర్యంలో !!!

కింద ఫొటోలో ఉన్నది కిమ్ మరియు అతని భార్య !