మొదటి సారి కేసీఆర్ మైండ్ బ్లాక్ చేసిన కిషన్ రెడ్డి

June 03, 2020

మనం మాట్లాడేటపుడు కాన్పిడెన్సుతో మాట్లాడితే అవి అబద్ధాలైనా నిజాల్లాగే అనిపిస్తాయి అన్న విషయాన్ని గట్టిగా విశ్వసించిన వ్యక్తి కేసీఆర్. కరెంటు తాను ఒక్కడినే ఇస్తున్నానని అబద్ధం చెప్పినా... జనం నమ్ముతున్నారంటే అది చెప్పేటపుడు అతనిలోని కాన్పిడెన్సే కారణం. ఫ్యాక్ట్ చెక్ ఎందుకులేబ్బా అనేంత రమ్యంగా మాట్లాడతారు కేసీఆర్. అయితే... అన్ని సార్లు అందరి మాటలు చెల్లవు కదా. కేంద్రం ప్యాకేజీ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి గట్టి కౌంటరే వేశాడు. కేసీఆర్ ఖాతాలో వేస్తేనే కేంద్రం డబ్బులు ఇచ్చినట్టా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కేంద్రంపై  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో  తెలుగు వాడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి గట్టి రిప్లై వచ్చింది కేసీఆర్కి. కేంద్రం తీరును తప్పు పట్టే ముందు.. రాష్ట్రాలుగా మీరు చేస్తున్నదేమిటంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. పన్నుల వాటాకు సంబంధించి కేంద్రం ఇచ్చేదేమిటి? అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇదేమాట కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు అనలేదన్న సందేహాన్ని లేవనెత్తారు కిషన్ రెడ్డి. రాష్ట్రాలకు ఇచ్చే నిధులను మోడీ సర్కారు 32 శాతం నుంచి 41 శాతానికి పెంచారని.. ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంపుపై విమర్శలు సరికాదన్నారు. 

వ్యవసాయానికి, సెలూన్లకు, నేత మగ్గాలకు ఉచిత విద్యుత్తును మేము ఏమైనా అడ్డుకున్నామా? అన్న కిషన్ రెడ్డి..  హైదరాబాద్ పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో మీటర్లులేకుండా విద్యుత్ వాడుకుంటున్నారని.. అలాంటి వారి నుంచి వాడిన దానికి బిల్లు వసూలు చేసే దమ్ములేని కేసీఆర్  ఇతర ప్రజల మీద భారం వేస్తున్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య అందరిని టచ్ చేసింది. పాత బస్తీ వాళ్లు బెదిరిస్తారు కూడా మీరు బిల్లలు వసూలు చేయరు. సాధారణ ప్రజలు కడతారు కాబట్టి పాతబస్తీ నష్టాలు ఇతర ప్రజలపై వేస్తారా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

రాష్ట్రాల్ని కేంద్రం బిచ్చగాళ్లుగా చూస్తుందంటున్నావు. దేశంలో ఎవరూ ఎవరికి బిచ్చం వేయరు. కేంద్ర నిధులు పొందటం రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల నిధులు పొందడం పంచాయతీల హక్కు. మరి పంచాయతీకు బిక్షం వేస్తున్నట్లు నువ్వు ఎలా మాట్లాడావు గతంతో అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.  ఈ కామెంట్ కేసీఆర్ కు ఎక్కడో తగిలింది. నిజమే కేసీఆర్ పల్లెలకు నిధులు ఖర్చు పెడుతున్నపుడల్లా తన దయతో ఖర్చు పెడుతున్నట్లు చెబుతారు.

కేంద్రం సంస్కరణలు మీకు తప్పుగా కనిపిస్తాయి... కానీ రైతులు ఏ పంటలు వేయాలో మీరు చెబుతారా? ఈ రెండు బుద్ధులు ఎందుకు మీకు అంటూ కేసీఆర్ ను నిలదీశారు కిషన్ రెడ్డి. మీ మెడ మీద కత్తిపెట్టి... కరెంటు సంస్కరణలు తెస్తే నిధులు ఇస్తామన్నది నీకు తప్పుగా అనిపించినపుడు, నీవు చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని చెప్పడం తప్పుగా అనిపించలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మాట టీఆర్ఎస్  ఫీజులు ఎగిరిపోయేలా చేసింది.

పేదలకు ఇచ్చే కేజీ బియ్యం మీద కేంద్రం రూ.28 రాయితీ ఇస్తే, తెలంగాణ కేవలం రూ.1 మాత్రమే ఇస్తున్న విషయాన్ని చెబితే మీ సిగ్గు పోతుందన్నారు. మొత్తంగా మొదటి సారి కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొన్నారు కిషన్ రెడ్డి. 

---

ఇవి చదివారా?

ఆ చైనా యాప్ కి మూడింది... ఇండియన్స్ యాంగ్రీ 

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ 2 ఫొటోలు చూశారా