ర‌మేష్ కుమార్ వ‌స్తే నా బొచ్చు పీకుతాడా? - వైసీపీ ఎమ్మెల్యే

May 31, 2020

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ స్థాయి మరిచి బూతులు మాట్లాడటం సర్వసాధారణం అయిపోయింది. అధికారం ఉంటే ఎవరైనా తమ మాట వినాల్సిందే, వినకపోతే కేసులు, తిట్లు, బూతులు తప్పవు అన్నట్లుంది ఏపీలో పరిస్థితి. వ్యవస్థలపై, ఉన్నత వ్యక్తులపై, రాజ్యాంగ హోదాలపై, చివరికి కోర్టులపై కూడా జంకు లేకుండా బూతుల వర్షం కురిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏపీలో జగన్ బృందం ఎవరికీ భయపడటం లేదు, కోర్టులకు అస్సలు భయపడటం లేదు. అధికార పార్టీని కోర్టులు ఏమీ చేయలేవు అన్న భ్రమతో ఉన్నారు.

తాజాగా కొడాలి నాని మాట్లాడిన మాటలు చూస్తుంటే పరిస్థితి అర్థమైపోతుంది. సాధారణంగా బూతులు అవలీలగా మాట్లాడే కొడాల నాని తాజాగా మొన్నటివరకు ఎస్ ఈ సీగా పనిచేసిన (మాజీ అనలేం ఎందుకంటే కేసు ఇంకా కోర్టులో ఉంది) రమేష్ కుమార్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరో మీడియా రిపోర్టరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ రమేష్ కుమార్ వస్తే నా బొచ్చేమైనా పీకుతాడా అంటూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఎప్పటికపుడు దిగజారి మాట్లాడే కొడాలి నాని ఎప్పకపుడు మరింత నీచమైన భాష మాట్లాడుతూ జనాల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. గతంలో ఏకంగా ప్రెస్ మీట్లోనే ఆయన నీయమ్మ మొగుడు వంటి పదజాలాన్ని వాడాడు. అదేం కర్మ ఏ పదమైన వాడగలిగిన వ్యక్తి కొడాలి నాని. 

నాని మాటలను బట్టి రమేష్ కుమార్ కేసు గెలిచి మళ్లీ ఎస్ ఈ సీగా వస్తారేమో అన్న ప్రశ్నకు కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అర్థమవుతోంది. అంతేకాదు నాని మాటలను బట్టి చూసినా కేసును కోర్టు సీరియస్ గా పరిగణించిన విషయం గమనించినా... రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నా కచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు గెలిచే అవకాశం ఉంది. అయితే... ఆయన కేసు గెలిచి పదవి కాపాడుకోగలరు గానీ... నిమ్మగడ్డ ఆ పదవిలోకి వచ్చినా... సహకరించాల్సిన ఎన్నికల సిబ్బంది, గ్రౌండ్ లెవెల్ సిబ్బంది సహకరించడం అనుమానమే. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు మాత్రమే నిమ్మగడ్డ కు పవర్ ఉంటుంది. ఆ తర్వాత అతనికి సహకరించిన అధికార, సిబ్బందికి జగన్ సర్కారు చుక్కలు చూపించకమానదు. ఎందుకంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత బహిరంగంగా సహాయ నిరాకరణ, విమర్శలు చేస్తే ఇక కింది వారు ఎలా మాట వింటారు?