బాబు, పవన్ - హిందుమతంపై నాని సంచలన వ్యాఖ్యలు

February 26, 2020

ఏపీ ముఖ్యమంత్రి అనుసరించే మతం ఏంటో అందరికీ తెలుసు. మతం మారినా హిందుకులాన్ని ఎందుకు వెనకేసుకుని తిరుగుతున్నాడో కూాడా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. వైసీపీ క్యాడర్ జగన్ పూజలు చేసే ఫొటోలను సోషల్ మీడియాలో తెగ పెడుతూ ఉంటుంది. అదేసమయంలో క్రిస్టియానిటీ ఫొటోలను దూరం పెడతారు. తాజాగా నా మతం మానవత్వం అని మతం చర్చకు జగన్ తెరలేపాడు. ఈ నేపథ్యంలో పవన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ కులం మాట నిలబెట్టుకునే కులం, ఇతరుల కులాలు మాట తప్పే కులాలా? ఎందుకు ప్రజలను అవమానపరుస్తున్నారు అంటూ పవన్ గట్టిగా నిలదీశారు.

మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరలో మత మార్పిడులు జరగడంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఒక మతాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నారని అందుకే ఆ మతానికి ప్రోత్సాహకాలు ప్రకటించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. అదే సమయంలో తిరుమల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ వారికి ఆగ్రహం తెప్పించింది. ఇవవ్నీ ససాక్ష్యాలతో ఉన్న విషయాలు. జగన్ వచ్చాక చర్చి ఫాస్టర్లకు నెలనెలా జీతాలు ఇవ్వడం అనే కాన్సెప్టే చాలా చిత్రమైనది. ప్రజల పన్ను డబ్బు ఇలా పప్పు బెల్లాల్లా మత మార్పిడులు చేసే వారికి ఇవ్వడం శోచనీయం అని బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తాజాగా అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏమైనా హిందుమతానికి అంబాసిడర్లా అని కొడాలి నాని విమర్శించారు. ఆ మాట అనే ముందు జగన్ ఎవరు? అని నాని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీ సామాజికంగా చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి. లేకపోతే సైలెంటుగా ఉండాలి. కానీ ఇలా తిరిగి ఎదురుదాడ ిచేయడం నానికే చెల్లింది. తమాషా ఏంటంటే... సమర్థించుకోలేని స్థాయిలో వైసీపీ ప్రభుత్వం తప్పులు చేయడంతో ఇపుడిలా బోల్తా పడింది. బాబు, పవన్ హిందువులన్నది నిజం. జగన్ హిందువు కాదన్నది నిజం. ఇది తెలుసుకోకుండా నాని బాబు పవన్ లు హిందుమతం అంబాసిడర్లా ? అని ప్రశ్నిస్తే ఎలా. హిందు మతంపై ప్రశ్నించడానికి హిందువు అయితే చాలు. ప్రత్యేకంగా అంబాసిడర్ అవ్వాల్సిన అవసరం ఏముంది నాని గారు?