కోడెల భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు

May 31, 2020

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలను షాక్‌కి గురి చేసింది. ఈ రోజు (సోమవారం) ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీంతో కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆయన పోస్ట్‌మార్టం నిర్వహించారు. రెండు గంటల పాటు జరిగిన ఈ పోస్ట్‌మార్టం పూర్తియింది. పోస్టుమార్టం అనంతరం కోడెల శివప్రసాదరావు పార్థివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌కు తరలించారు. అక్కడ టీడీపీ నేతలు, అభిమానులు కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి ఆయన మృత దేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌ లోనే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం తన స్వగ్రామమైన నర్సరావుపేట తీసుకుకెళ్లనున్నారు. కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్‌ వెళ్లనున్నారని సమాచారం. సూర్యాపేట, విజయవాడ మీదగా రోడ్డు మార్గంలో వెళ్లి మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. మంగళవారం నర్సరావుపేటలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

మరోవైపు కోడెల మృతిపై తెలంగాణ పోలీసుల విచారణ చేపట్టారు. కోడెల ఇంటికి మరోసారి వెళ్లిన బంజారాహిల్స్ ఏసీపీ.. కోడెల కుటుంబసభ్యుల వద్ద వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఎంటరై ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు, ఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. 

Read Also

కేసీఆర్ కలకు హైకోర్టు బ్రేక్ 
గ్యాంగ్ లీడ‌ర్ ఎక్క‌డున్నాడు..
జగన్... అఖిలను చూడు, ఆమెకున్న బాధ్యత లేదా