కోడెల అష్టదిగ్బంధనం

July 05, 2020

రాష్ట్ర స్పీక‌ర్ గా గౌర‌వ‌నీయ స్థానంలో ఉన్న కోడెల కుటుంబ స‌భ్యులు.. కోడెల‌కున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని దారుణాల‌కు పాల్ప‌డ్డారా? అన్న విష‌యం తాజాగా న‌మోద‌వుతున్న పోలీసు కేసుల్ని చూస్తుంటే తెలుస్తోంది.కోడెల కుటుంబం కే ట్యాక్స్ పేరుతో వంద‌ల కోట్లు దోచుకున్న‌ట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయి రెడ్డి ఆరోపించారు.
దందా చేసిన కోడెల కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే కాదు.. వారికి స‌హ‌క‌రించిన అధికారులు కూడా దోషులేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నిర్బంద వ‌సూళ్ల మీద ద‌ర్యాప్తు సాగుతోంద‌ని.. మాఫియా ఆగ‌డాల‌పై బాధితులు ఎలాంటి భ‌యం లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌ని పిలుపునిచ్చారు. కే ట్యాక్స్ మీద‌.. విజ‌య‌సాయి ఇంత ఓపెన్ గా భ‌రోసా ఇచ్చిన త‌ర్వాత‌.. భారీగా ఫిర్యాదులు రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. కోడెల ఫ్యామిలీకి రానున్న రోజుల్లో తీవ్ర క‌ష్టాలు చుట్టుముట్టే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  

నాయకుడు పడిన నేలపాలు చేసిన నేతలకు ఇలాంటి ఇబ్బందులు రావడంలో ఆశ్చర్యం ఏముంది. కోడెల వల్ల ఆయన నియోజకవర్గంలోనే కాదు... జిల్లా మొత్తంలో టీడీపీకి చెడ్డపేరు వచ్చిందని చెబుతుంటారు.