బ్రేకింగ్‌: కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య‌

July 07, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ అసెంబ్లీ స్పీక‌ర్‌, టీడీపీ సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సారావు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం త‌న ఆరోగ్య ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో ఆయ‌న ఆసుప‌త్రిలో చేరారు. ఇక తాజాగా కేసుల ఒత్తిళ్ల‌తో పాటు అటు కుమారుడు, కుమార్తె తీరుపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌తో తీవ్రంగా మ‌న‌స్థాపానికి గురైన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సోమ‌వారం హైద‌రాబాద్‌లోనే త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న త‌న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకోవ‌డంతో ప‌రిస్థితి విష‌మించింది.

వెంట‌నే కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌తార‌కం ఆసుపత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందారు. కోడెల రాజ‌కీయ ప్ర‌స్థానం విషయానికి వ‌స్తే గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2న జన్మించిన కోడెల శివప్రసాదరావు జన్మించారు. కోడెలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు గ‌తంలోనే రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందారు.

న‌ర‌సారావుపేట‌లో డాక్ట‌ర్‌గా ఉన్న ఆయ‌న ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1983, 85, 89, 1994, 2014లో నరసరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. ఆయ‌న చేప‌ట్టిన ప‌ద‌వులు చూస్తే 1987-88 మధ్యలో హోంమంత్రిగా ఈయన పనిచేశారు. 1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా, 197-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెల పనిచేశారు.

2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు. న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌గా కూడా ఆయ‌న రికార్డుల‌కెక్కారు. 2004, 09 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కాసు వెంక‌ట కృష్ణారెడ్డి చేతిలో ఓడిన ఆయ‌న‌, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబు చేతిలో ఓడిపోయారు.