జగన్ రాజ్యంలో మోడీ రూల్స్ కు ఛాన్సే లేదు

August 04, 2020

మోడీ, అమిత్ షా ల మాటకు ఎదురు చెప్పడు జగన్ అని అందరూ అంటూ మీరేంటి మోడీ రూల్స్ జగన్ పాటించడు అంటున్నారు అని సందేహ పడుతున్నారా? మరి జగన్ అంటే అంతే. లాక్ డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, జాతర్లు, పండగలు,  గుళ్లు, బళ్లు అన్నీ బంద్. గుంపులుగా ఎక్కడా మనుషులు కనపడకూడదు. ఇవన్నీ దేశంలో 28 రాష్ట్రాల్లోనే చెల్లుతాయి. మోడీ రూల్స్ చెల్లని ఒకే ఒక రాష్ట్రం.... ఆంధ్రప్రదేశ్. 

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడిన కుటుంబాలను, ఇతర బాధితులను జగన్ దయచూపి ఆదుకున్నారట. దీనికోసం జగన్ కు కృతజ్జత తెలపడానికి లాక-డౌన్ రూల్స్ ఉల్లంఘించి భారీ కోలాటం ఏర్పాటుచేశారు. దాన్ని చూడటానికి జనాన్ని కూడా పెద్ద ఎత్తున పోగేశారు. మరి మోడీ తన ఇష్టమొచ్చినట్లు లాక్-డౌన్ పెడితే జగన్ ఎలా ఒప్పుకుంటారు. అది ప్రత్యేక దేశం కదా మరి. అక్కడ జగన్ రూల్స్ మాత్రమే చెల్లుతాయి. 

మనిషి ప్రాణం పోయిన బాధ కంటే జగన్ ఇచ్చిన డబ్బులే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిన సందర్భంగా కోలాటం జరిపి స్థానికులు అందరూ పండగ చేసుకున్నారు. మీరు అదెలా అని ప్రశ్నించారనుకో.... మీ ఇష్టం... రంగనాయకమ్మ గుంటూరులో ఏం చేశారో తెలుసు కదా. ప్రభుత్వాన్ని దూషించినా, అసత్య ప్రచారం చేసినా బొక్కలో వేస్తారు. మీ ఇష్టం మరి. అయినా స్థానికులు ఆ కోలాటం జరపొద్దని ఆపలేదంటే... మీ సొమ్మేం పోయింది? వారికి ఓకే అయితే మీకు నష్టమేంటి? ఏపీలో మోడీ గీడీ జాన్తా నై... అంతా జగన్ మయం. 

కోలాటం వీడియో : 

https://twitter.com/TdpFan9/status/1262393750229331969 

 

కింద కోలాటం జరిగినట్లు వార్త చూడొచ్చు.