రాజ‌మౌళిని ఇలా వాడేయ‌డం త‌ప్పు క‌దా?

May 29, 2020

ఒక‌ భాష‌కు చెందిన ఒక హీరోకు మ‌రో భాష‌లో క్రేజ్ రాగానే.. అంత‌కుముందు త‌న సొంత భాష‌లో న‌టించిన పాత సినిమాల‌న్నింటినీ వ‌రుస‌బెట్టి రిలీజ్ చేయ‌డం చూస్తుంటాం. ఇలా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు చాలా వ‌ర‌కు బెడిసికొడుతుంటాయి. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చాలా సినిమాల్ని త‌మిళం, హిందీలోకి డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. వాటినెవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని, ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ను కూడా ఇలాగే వాడుకు నే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది త‌మిళంలో. ర‌చ‌యిత‌గా ఎంత పేరు సంపాదించినా ద‌ర్శ‌కుడిగా గుర్తింపు కోసం త‌హ‌త‌హ‌లాడిన విజ‌యేంద్ర.. అక్కినేని నాగార్జున‌తో రాజ‌న్న అనే సినిమా తీసిన సంగ‌తి తెలిసిందే.
ఎప్పుడో 2011లో విడుద‌లైన సినిమా అది. ఓ మోస్త‌రుగా ఆడి వెళ్లిపోయింది. మ‌రీ పెద్ద స‌క్సెస్ ఏమీ కాదు. ఈ చిత్రంలో యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని రాజ‌మౌళి స్వ‌యంగా రూపొందించాడు. ఐతే ఇన్నేళ్ల త‌ర్వాత ఈ చిత్రాన్ని త‌మిళంలో విడుద‌ల చేయ‌బోతున్నారు. దీనికి సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. బాహుబ‌లి ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, సంగీత ద‌ర్శ‌కుడు (కీర‌వాణి) క‌లిసి చేసిన చిత్ర‌మిద‌ని.. దీని టైటిల్ అనౌన్స్ చేయ‌బోతున్నామ‌ని పెద్ద పోస్ట‌ర్ వేసి అప్ డేట్ ఇస్తున్నారు. కౌంట్ డౌన్ న‌డిపిస్తున్నారు.

ఎప్పుడో 8 ఏళ్ల కింద‌ట రిలీజైన సినిమాను ఇప్పుడు డ‌బ్ చేసి త‌మిళంలో విడుద‌ల చేయ‌డ‌మేంటి? అస‌లు ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన స్నేహ లుక్ చూస్తేనే ఇది ఇప్ప‌టి సినిమా కాద‌నే విషయం త‌మిళ జ‌నాల‌కు అర్థ‌మైపోతుంది. ఇలాంటి సినిమాకు పోస్ట‌ర్ల మీద రాజ‌మౌళి ఫొటో వేసి సినిమాను ప్ర‌మోట్ చేసిన జ‌నాల‌కు భ్ర‌మ‌లు క‌లిగించ‌డం త‌ప్పు క‌దా?  

Read Also

మోడల్ కాదు... శృంగార దేవత
దియా మీర్జా... హాట్ గ్యాలరీ
ఈనాటి సావిత్రి... నవ్వితే ఫ్లాటే !!