రేవంత్‌రెడ్డిపై కోమ‌టిరెడ్డి సెటైర్లు

June 02, 2020
CTYPE html>
ఒక రొట్టె ముక్క కోసం రెండు పిల్లులు దెబ్బలాడుకుంటే మధ్యలో కోతి వచ్చి దాన్ని ఎత్తుకుపోయిందట. ఈ పిట్ట కథ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడి పోవడానికి ఇదే కారణం. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాల‌కు లెక్కేలేదు. ఇదే ఇప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ కు అందివచ్చిన అవకాశంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు పార్టీ ఓడిపోయింది. ఈ క్రమంలోనే నేతలంతా ఒకే తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్‌లో గ్రూపు త‌గాదాలు మాత్రం ఆగడం లేదు. రోడ్డెక్కి రచ్చ రచ్చ చేస్తున్నారు. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి హుజూర్‌న‌గ‌ర్‌లో ప‌ద్మావ‌తి పోటీ ఎలా ?  చేస్తార‌ని చామ‌ల కిర‌ణ్‌రెడ్డి పోటీ చేస్తార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.
కొద్ది రోజుల క్రింద‌టే ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో త‌న భార్య ప‌ద్మావ‌తి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. ఉత్త‌మ్ ఆ ప్ర‌క‌ట‌న చేశాక కూడా రేవంత్ పంతంతో మ‌రో అభ్య‌ర్థి పోటీ చేస్తార‌ని చెప్ప‌డంతోనే టీ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య గ్యాప్ ఎలా ?  ఉందో తెలుస్తోంది. ఇక తాజాగా రేవంత్‌రెడ్డి టీ పాలిటిక్స్‌లో దూకుడుగా ముందుకు వెళుతుండ‌డంతో న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి ఒక్క‌ట‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.
తాజాగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన హుజుర్‌నగర్‌లో రేవంత్ రెడ్డి చెబుతున్న అభ‌ర్ధి ఎవరో నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలకే తెలియదన్నారు. త‌మ జిల్లా రాజ‌కీయాల్లో ఇత‌ర జిల్లాల‌కు చెందిన నాయ‌కుల జోక్యం అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఇక హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పిన‌ట్టే ప‌ద్మావ‌తిని నిల‌బెట్టి గెలిపించుకుంటామ‌న్నారు.
మమ్మల్ని కాదని కొత్త అభ్యర్ధిని నిలబెడతారా ? అంటూ ప్రశ్నించిన కోమటిరెడ్డి.... రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి కామెంట్స్ అని హెడ్డింగులు పెట్టకండి... అలా పెడితే నా పరువు పోతుందని సెటైర్ వేశారు. ఈ మధ్య పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు తమకు అవసరంలేదన్నారు. ఈ క్ర‌మంలోనే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి గురించి మాట్లాడుతూ.. ఈ ప‌ద‌వి రేసులో తాను ఒక్క‌డినే ఉన్నాన‌ని... గ‌తంలో విబేధాలు ఉన్నా ఉత్త‌మ్‌, తాను, జానా ఒక్క‌టే అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏదేమైనా రేవంత్ నాయ‌క‌త్వాన్ని ఈ టీ కాంగ్రెస్ సీనియ‌ర్లు అంగీక‌రించ‌డం కష్టంగానే క‌నిపిస్తోంది.