సంచలన వీడియో - కోనేరు కోనప్ప మళ్లీ అడ్డంగా బుక్కయ్యాడు

February 19, 2020

ఒక మహళని పశువును కొట్టినట్లు కొడితే ఆ దుర్మార్గానికి పాల్పడిన తమ్ముడిని సమర్థించుకునే ప్రయత్నం చేసి బాధితురాలిని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఆయన సెటిల్మెంట్ చేస్తున్న కొత్త వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులపై ఆదివారం దారుణమైన దాడితో తమ్ముడి పదవి పోయి అరెస్టు అయ్యాడు. అయితే ఆ దాడిని ఎమ్మెల్యే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దాడికి సంబంధించిన డ్యామేజీని తగ్గించుకోవడానికి అధికారులను ఇరికించడానికి గిరిజనులకు ట్రైనింగ్ ఇస్తున్న ఎమ్మెల్యే వీడియో ఒకట ిబయటకువచ్చింది. అందులో విలేకరులకు ఎలా చెప్పాలో ఆదివాసీలు, గిరిజనులకు ఆయన హితబోధ చేశారు. తప్పంతా అధికారులదే అన్నట్లుగా స్ర్కిప్టు తయారుచేసి వారికి వివరించారు. ఆ వీడియోలో ‘ ఇప్పుడు నేను విలేకరులను పిలిపిస్తున్నా. వాళ్ల ముంగిట చెప్పండి. భూములు దగ్గరకు వెళ్లొద్దని రోజు వచ్చి బెదిరిస్తున్నారు. భూముల్లో తవ్వకాలు జరిపారు. మా భూములు లోపల ఉన్నాయి. అక్కడకు వెళ్లకుండా మమ‍్మల్ని బెదిరిస్తున్నారు. 15 రోజుల క్రితం వచ్చి కొట్టారు. ఇప్పుడు మళ్లీ కొట్టారు. కొట్టాక అందరం దున్నొద్దని ట్రాక్టర్ల దగ్గరకు వెళ్లాం. అప్పుడే గొడవ అయింది. ఇదంతా చెప్పాలి. విలేకరులను పిలిపిస్తా. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.’ అంటూ ఎమ్మెల్యే ట్రైనింగ్ ఇస్తున్నారు.

ఇంత అరాచకం జరిగినా కనీసం పశ్చాత్తాపం కూడా లేదు ఎమ్మెల్యేలో. ఆ ఆడతల్లిని కొట్టిన కొట్టుడు చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. కోనేరు కృష్నారావు మనిషా, పశువా అని మొహం మీద ఉమ్మేస్తున్నారు. అయినా కూడా ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నారంటే అంతకంటే దారుణం ఇంకేముంటుంది. తప్పు చేసిన వారికి కూడా కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చి గెలిపించడంతో ఎమ్మెల్యేల గర్వానికి హద్దు లేకుండా పోతోంది. దానికి నిదర్శనమే ఈ వీడియో.