దమ్ముంటే అలా చేయి జగన్... !

June 03, 2020

ఏపీ సీఎం జగన్ పాలనపై మొదటి నుండి తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ చేతిలో సీఎంగా అధికారం ఉండడం పిచ్చోడి చేతిలో రాయి ఉండడం ఒకటేనని టీడీపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం జగన్ పాలన ....నాటి పిచ్చి తుగ్గక్ పాలనను మరపిస్తోందంటూ ఏకంగా తుగ్గక్ వేషంకట్టి మరీ టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై అక్కసుతో రాత్రికి రాత్రే ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ `హింసించే రాజు పులకేసి` తరహో నిర్ణయాలు ....తాజాగా ముచ్చటగా మూడు రాజధానుల నిర్ణయం వరకూ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో పాటు పలువురు సీనియర్ పొలిటిషన్లు కూడా జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ పై రాయలసీమకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త , కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలనా విధానాల్లో జగన్ తీరు మారకుంటే....మరోసారి గెలవడం కష్టమని కోట్ల హెచ్చరించారు.

సీఎం జగన్ పరిపాలనలో తీసుకుంటోన్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. జగన్ ఒంటెత్తు పోకడతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. అర్హులైన లక్షలాది మందికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కుంటి సాకులు చెబుతూ పెన్షన్లు నిలిపివేయడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై కోట్ల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని కోట్ల అభిప్రాయపడ్డారు. ఐదెకరాల భూమి ఉందనో, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో పథకాలను నిలిపివేస్తే నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని కోట్ల అభిప్రాయపడ్డారు. ఆదాయ వనరులు, అవసరాలను కూడా జగన్ సర్కార్ పరిగణనలోకి తీసుకోవాలని కోట్ల చురకలంటించారు. సీఏఏకు పార్లమెంటులో మద్దతు పలికిన వైసీపీ రాష్ట్రంలో సీఏఏకు వ్యతిరేకమంటూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోట్ల డిమాండ్‌ చేశారు. ప్రజల్ని రెచ్చగొట్టేలా బీజేపీ విధానాలున్నాయని కోట్ల విమర్శించారు.