వైసీపీ ఎమ్మెల్యే అజ్జానంతో జగన్ బుక్కయ్యాడే 

August 13, 2020

రాజకీయ నాయకుడు పార్టీ బలంతో, డబ్బుతో మొదటి సారి ఎమ్మెల్యే కావచ్చు. కానీ ఎమ్మెల్యే అయ్యాక అయినా కాస్త రాజకీయం నేర్చుకోవాలి. లేకపోతే అనుభవ రాహిత్యం వల్ల అధినేతలు బుక్కవ్వాల్సి వస్తుంది. అందుకే అంటుంటారు తెలివైన శత్రువుకన్నా అమాయకుడైన స్నేహితుడే ప్రమాదకరం అని. 

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తనను రాజకీయంగా పైకి తీసుకువచ్చారు అన్నా కృతజ్జతతో ఆయన రుణం తీర్చుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యానారాయణ తన స్వామి భక్తిని చాటుతున్నారు. ఈ లాయల్టీ అభినందనీయం. 

ఇందులో భాగంగా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పార్టీనే విమర్శిస్తున్న వైసీపీ నర్సాపూర్ ఎంపీను చెడుగుడు ఆడేందుకు ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామరాజు ఆయన మీద కూడా విమర్శలు చేయడంతో కొట్టు సత్యనారాయణకు మరింత మండింది. దీంతో ఈరోజు రఘురామ రాజుపై గట్టిగా వార్నింగ్ ఇస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కొట్టు సత్యానారయణ ఏమన్నారంటే... 

‘‘రఘురామకృష్ణంరాజు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. రఘురామకృష్ణంరాజు ఓ ఆర్థిక నేరస్తుడు. అతడిపై ఢిల్లీలో 420 కేసు నమోదైంది. ఆయన ఒక 420 అని, ఒక దొంగ అని తమకి ఇప్పుడే తెలిసింది. సీఎం జగన్, పార్టీ ఆదేశాల వల్లే అతడి గెలుపు కోసం తామంతా కలిసి పని చేశాం.

అయితే... అతనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన నమోదైన కేసుల మీద అవగాహన ఉన్నట్టు లేదు. తమ పార్టీ అధినేత మీద ఉన్న కేసుల గురించి కొట్టు సత్యానారాయణకు తెలియకపోవడం (?) వల్ల కేవలం ఒక్క 420 కేసు నమోదు అయిన కారణంగా రఘురామరాజు ను ‘‘ ఒక దొంగ’’ అనేశాడు కొట్టు సత్యానారాయణ. 

ఇది తెలిసి ఆయనకు పలువురు వైసీపీ నేతలు ఫోన్ చేశారట... ఠక్కున ఏది పడితే అది అనేయకండి. మీరు మన వాళ్లపై లేని కేసులు రఘురామరాజుపై ఏమైనా ఉంటే వాటినే విమర్శించండి. ఈరోజు మీరు రఘురామ రాజుని ఏ కేసు కారణంగా అయితే ‘దొంగ’ అని ముద్ర వేశారో... అదే కేసు మన పార్టీ అధినేతపై కూడా నమోదైంది. పైగా సీబీఐ నమోదు చేసింది అని కొట్టుకు క్లాస్ పీకారట.

కొట్టులాంటి వారిని పార్టీ కాస్త కనిపెట్టుకోవాలి. లేకపోతే ఎవరినో విమర్శించబోయి సొంత పార్టీ అధినేతను బదనాం చేసేలా ఉన్నాడు. 

ఇది ఏపీ ముఖ్యమంత్రిపై నమోదైన కేసుల వివరాలు -  NDTV Link   

Image