​వైసీపీలో భారీ కుదుపు -  సీక్రెట్ మీటింగ్ ?

August 08, 2020

జగన్ కి కొత్త సెగ తగిలే ప్రమాదం కనిపిస్తోంది. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉందని సమాచారం. మా రెండు జిల్లాల్లో భవిష్యత్తులో ఓడిపోయినా పర్లేదు తాను నెగ్గితే చాలనుకుని జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు అర్థం కావడంతో భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక వర్చువల్ సమాచారం నిర్వహించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లోనే కాదు భవిష్యత్తులో తాము ఎట్టి పరిస్థితుల్లోను గెలిచే అవకాశమే లేదని భావించడంతో... ఏం చేయాలనే దానిపై వైసీపీ ద్వారా గెలిచిన ఆ ప్రాంత ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికల ముందు అమ​రావతే రాజధాని గా ఉంటుందని​ జగన్​ ప్రకటించ​డంతో మేము బలంగా జనాలకు అదే చెప్పాం. ఇపుడు మా వీడియోలతోనే మాపై ప్రజలు దాడి చేస్తున్నారు అని వారు వాపోతున్నారు. రెండు జిల్లాల్లోను జగన్ విశ్వసనీయత కోల్పోయారని...అలాంటపుడు భవిష్యత్తులో ఇక్కడ గెలిచే అవకాశం లేని  వైసీపీలో ఉండాలా వద్దా అన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలనుకుంటే రాజీనామా చేసి కొనసాగాలని... లేదంటే వేరే ఏదైనా పార్టీ మారాలా? స్వతంత్రంగా ఉండాలా అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.

రాజధాని తరలింపు తమ రాజకీయ జీవితానికి మరణశాసనం అంటున్న​ అని​ వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు ​మొత్తం భావిస్తున్నట్లు సమాచారం. ​ఇది​ తమకు​ కోలుకోలేని దెబ్బ అని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా​ లైట్ గా తీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్న ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా మంతనాలు. గుంటూరు జిల్లా లో 1​3 మంది శాససభ్యులు,​ ​కృష్ణా జిల్లా లో 1​2 మంది శాససభ్యులు ​ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం​. వీళ్ల మీటింగ్స్ కి మంత్రులను దూరంగా ​ ​పెట్టినట్టు సమాచారం.​ వీరితో టిడిపి నుండి వైఎస్ఆర్సిపి లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల​తో కూడా సంప్రదింపులు చే​సే ఆలోచనలో​ వైఎస్ఆర్సిపి అసమ్మతి వర్గం​ ఉన్నట్లు సమాచారం. ​