must watch: కోవ్యాక్సిన్ సృష్టికర్త ‘‘కృష్ణ ఎల్లా‘‘ ఇంటర్వూ

August 11, 2020

130 కోట్ల జనాభాలో సగం మందికి కోవిడ్ నియంత్రణలు పాటించడానికి అవకాశం, జ్ఝానమూ, సదుపాయాలు లేని పరిస్థితిలో ఉన్న మనదేశంలో కరోనా వ్యాప్తిని ఆపడం సులువైన విషయం కాదు. దీని నుంచి బయటపడాలంటే... వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. సాధారణంగా వ్యాక్సిన్ల తయారీకి చాలా సమయం పడుతుంది. అంటే మూడు నుంచి పదేళ్లు పడుతుంది. అయితే, కరోనా పాండెమిక్ తీవ్ర కాస్త వేగంగా మన చేత ఈ పనిని చేయిస్తోంది.

ఈ నేపథ్యంలో భారతదేశం ఒక పెద్ద ముందడుగు వేసింది. ​కోవిడ్‌ నియంత్రణకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)సహకారంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ దశకు చేరుకుంది.  దీనికి ‘కో వ్యాక్సిన్‌’ గా పేరు పెట్టారు. కరోనా కట్టడికి తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నామని, ఇదొక మైలురాయి వంటిదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఈ టీకా అభివృద్ధిలో ఐసీఎంఆర్, ఎన్ఐవి సహకారం కీలక పాత్ర పోషించాయనీ, అలాగే తమ ఆర్‌అండ్‌డి, తయారీ బృందాలు అవిశ్రాంతంగా కృషి చేశాయని పేర్కొన్నారు.​

ఈ సందర్భంగా ఈటీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలుకీలక విషయాలు చెప్పారు. వ్యాక్సిన్ కి తేదీ ఇపుడే చెప్పలేమని... కాకపోతే  2021 నాటికి 130 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించగలం అన్నారు. ఆయన మాటలను బట్టి ఈ డిసెంబరు నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుంది. 2021 డిసెంబరు నాటికి దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.