త‌ల‌సాని, మ‌ల్లారెడ్డి ఔట్‌...కేటీఆర్, హ‌రీశ్‌రావు ఇన్‌

July 09, 2020

తెలంగాణ‌లో ఎంఐఎం సీటును మిన‌హాయిస్తే మిగిలిన ప‌దహారు సీట్ల‌ను గెల‌వాల‌ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అంతే కాదు కేసీఆర్తో పాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్త్ర‌త ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.. కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.. దీంతో ఎంపి స్థానాల‌న్నీ త‌మ ఖాతాలోకి వ‌స్తాయ‌ని టీఆర్ఎస్ భావించింది. అయితే అనుహ్యాంగా కేవ‌లం తొమ్మిది స్థానాల‌కే గులాబీ పార్టీ ప‌రిమిత‌మైంది.తెలంగాణ మంత్రుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.. త‌మ ప‌ద‌వుల‌కు ఎప్పుడు ఎర్త్ ప‌డుతుందోన‌న్న భ‌యం వారిని వెంటాడుతోంది. ప్ర‌ధానంగా గ్రేట‌ర్ ప‌రిధిలోని మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి ప‌ద‌వ‌లులు ఊడ‌టం ఖాయ‌మంటున్నారు. వీరి బ‌దులుగా...టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత‌లు కేటీఆర్‌, హ‌రీశ్‌రావుకు కేబినెట్లో బెర్త్ కాయ‌మంటున్నారు.

గ్రేట‌ర్ కు సంబంధించి మంత్రి త‌ల‌సాని కుమారుడు సాయికిర‌ణ్ కు సికింద్రాబాద్ ఎంపి సీటును టీఆర్ఎస్ కేటాయించింది.. సికింద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి.. అయినా కూడ ఇక్క‌డ కిష‌న్ రెడ్డి గెల‌వ‌డంతో సీఎం న‌గ‌ర నేత‌ల‌పై సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.. దీంతో మంత్రి త‌ల‌సానిలో ఆందోళ‌న మొద‌లైన‌ట్లు అయ‌న సన్నిహితులు చెబుతున్నారు. గ్రేట‌ర్ కు సంబంధించి మ‌రో మంత్రి అయిన మ‌ల్లారెడ్డిలో ఇదే ర‌కం భ‌యం క‌నిపిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌ల్లారెడ్డి అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంపిగా పోటీ చేశారు. అయితే, ఆయ‌న ఓట‌మి పాల‌వ‌గా...ఇక్క‌డి నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందారు.. త‌మ కుటుంబానికే చెందిన నేత‌ల‌ను గెలిపించుకోలేక‌పోవ‌డంతో త‌మ మంత్రి ప‌ద‌వులు ఊడిన‌ట్లేనని ఈ అమాత్యులు భావిస్తున్నార‌ని అంటున్నారు.

కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, త‌న త‌న‌యుడు కేటీఆర్‌ను, మేన‌ల్లుడు, మాజీ మంత్రి హ‌రీశ్‌రావును కేబినెట్లోకి తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇద్ద‌రు మంత్రుల‌ను తొల‌గించి ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను పార్టీలోకి తీసుకుంటార‌ని, రాబోయే వారంలో జ‌ర‌గ‌బోయే విస్త‌ర‌ణలో ఈ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాలు సైతం దీన్ని తోసిపుచ్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.