విజయం తన ఖాతాలో వేసుకున్న కేటీఆర్

July 02, 2020

మొన్నటి ఎంపీ ఎన్నికల ఫలితాలు రాగానే ఓటమిని ఎమ్మెల్యేలు కేడర్ మీదకు నెట్టిన సీఎం సుపుత్రుడు కేటీఆర్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వచ్చేటప్పటికి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 3,556 ఎంపీటీసీ స్థానాలు,32 జడ్పీ స్థానాలు టీఆర్ఎస్కి దక్కాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడుపై స్పందించిన కేటీఆర్ ఇది చారిత్రక, అసాధారణ విజయం అని వ్యాఖ్యానించారు.
ఓడిపోయాక దానిని ఎవరి మీద రుద్దాలా అని ఆలోచించి స్పందించి... ఇపుడు ఫలితాలు కూడా సంపూర్ణంగా వెలువడకముందే గెలుపు కుర్చీపై ఖర్చీఫ్ వేశాడు కేటీఆర్. 2001లో టీఆర్ఎస్ పుట్టిన ఏడాదే పరిషత్ ఎన్నికలు వచ్చాయి, అప్పుడు కరీంనగర్, నిజామాబాద్ జడ్పీ పీఠాలు దక్కించుకుని సత్తాచాటాం. ఇది ఐదో స్థానిక ఎన్నికల క్రతువు అని, ఇపుడు అన్నీ టీఆర్ఎస్ వే అన్నారు. నూటికి నూరు శాతం జిల్లాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని, ప్రజలకు రుణపడి ఉంటామని కేటీఆర్ అన్నారు.
బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా సరే కేసీఆరే మా నాయకుడు అంటూ ప్రజలు ఈ పలితాల ద్వారా చెప్పారని కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, ఇదే కేటీఆర్ కారు సారు పదహారు అంటూ ఎంపీ ఎన్నికల్లో తెగ హడావుడి చేసి బొక్క బోర్లా పడ్డాడు.
అయినా.... ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల ఒరిజినల్ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం తక్కువ. ఎందుకంటే అధికార పార్టీ ఏ ఊర్లో ఓడిపోయా... ఆ ఊర్లో సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద బొక్కే పడుతుంది. అందుకే జనర్ గా ఎపుడూ అధికార పార్టీలే స్థానిక ఎన్నికల్లో గెలుస్తుంటాయి. ఇది సర్వసాధారణం... దీన్ని భారీ విజయంగా చూసుకుని మురిసిపోతే ఎదురు దెబ్బ తప్పదు.