కేసీఆర్ బర్త్ డేకి కేటీఆర్ అడ్వాన్స్ ప్లానింగ్

April 03, 2020

ఓపక్క చేతిలో అధికారం.. మరోవైపు ఊపిరిసలపనంత బిజీగా ఉండి కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాజకీయప్రముఖుడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను చెప్పాలి. తాజాగా ఆయనో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టిన రోజు ఈ నెల 17న. దీనికి వారం ముందే.. ఆయన ఒక ట్వీట్ చేస్తూ.. సారు పుట్టినరోజున ఏమేం చేయాలన్ని చెప్పేశారు.
సారు బర్త్ డే వేళన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. ముఖ్యమంత్రి 66వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న వేళ.. ఆయన ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ కార్యకర్తలు.. నేతలు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలంటూ పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరు ఒక్కో మొక్కను నాటి హరితహారం స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో సారు పుట్టినరోజును వారం ముందే అలెర్ట్ చేయటమే కాదు.. ఆ రోజు ఏమేం చేయాలో ట్వీట్ తో చెప్పేసిన వైనం చూస్తే.. ఈసారి బర్త్ ను ధూంథాంగా చేసేటట్లున్నారే?