కేటీఆర్... మీ నాన్న ఏమన్నాడో మరిచిపోయావా?

July 21, 2019

తప్పులు కవర్ చేసుకోవడంలో, అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన బ్యాచ్ టీఆర్ఎస్ బ్యాచ్. వాళ్లే ఆంధ్రలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అంటారు. మళ్లీ వాళ్లే ఆంధ్రోళ్లు మంచోళ్లు అంటారు. వాళ్లే చంద్రబాబు గొప్పోడు అంటారు. ఇంకోసారి వాళ్లే చంద్రబాబు దొంగ అంటారు. ఏరోజు తమ మాట మీద నిలబడిన రాజకీయ పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే... అది కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీయే. అయితే, అనేక అబద్ధాలు చెప్పినా కేవలం మాటకారి తనం ఉండటం వల్ల ఎప్పటికపుడు జనాల్ని బురిడీ కొట్టిస్తూ బతికేస్తోంది ఆ పార్టీ.
తాజాగా కేటీఆర్ గారు ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న వేశారు... చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలు తప్పని ఒప్పుకుంటారా అని? అయితే, ఇక్కడ కేటీఆర్ గమనించాల్సిన విషయం ఏంటంటే... ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. అది జరగకుండా వీవీ పాట్ లెక్కింపు చేయాలని ఆదేశించమన్నది చంద్రబాబు వాదన. పైగా చంద్రబాబు పని అయిపోందని వాళ్ల కార్యకర్తలే అనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెలవిచ్చారు. ఇంకో ముత్యం వంటి మాట చెప్పారు... ‘‘ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమట‘‘.
అయితే, కేటీఆర్ చరిత్ర మరిచిపోయి ఉంటారని మేము అనుకోవడం లేదు. కాకపోతే జనాలు వెర్రి పుష్పాలు అని వారి ప్రగాడ నమ్మకం అని అనుకుంటున్నాం. కావాలంటే... టీవీ9 లైబ్రరీలో గాని, ఓపిక ఉంటే యూట్యూబులో గాని వెతికితే కేటీఆర్ తండ్రి కేసీఆర్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యమని చెప్పిన మాటలు సాక్ష్యాలతో దొరుకుతాయి. ఒక సందర్భంలో టీవీ9లో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి చర్చ జరిగితే అపుడు కేసీఆర్ మాట్లాడుతూ... అంతరిక్షంలోకి పోయిన మనం ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేం అంటే ఎట్లా నమ్ముతాం... అది మనిషి తయారుచేసిందే కదా అని మాట్లాడారు.
తండ్రి కేసీఆర్ ఈవీఎంల మీద గోల చేసి దాని మీదనే ఎలా గెలిచారు అనే దానిపై ముందు స్పందన తెలుసుకుని ఆ తర్వాత చంద్రబాబు స్పందన గురించి కేటీఆర్ ప్రశ్నిస్తే బాగుంటుంది. ఈ భూమ్మీద నీకు తప్ప అందరికీ మతిమరుపే ఉంటుందనుకోవడం మూర్ఖత్వం అవుతుంది కేటీఆర్ గారూ.

ఇంకా కేటీఆర్ మరో మాట అన్నారు. ట్యాంపరింగ్ జరిగితే ప్రజలు తిరగబడతారని తెలిపారు. మరి 26 లక్షలు ఓట్లు తీసేసి సింపుల్గా సారీ చెబితే జనం పట్టించుకోలేదు. అడ్డంగా ఇతర పార్టీల వారిని నెల తిరక్కుముందే కొంటే ప్రజలు తిరగబడలేదు. ఇపుడు తిరగడతారా? కేటీఆర్ సార్... మీ టైం నడుస్తోంది. ఏమైనా మాట్లాడతారు. ఏమైనా చేస్తారు. టెక్నాలజీ నమ్మే బాబు టెక్నాలజీని వ్యతిరేకించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తుపాకి దొంగల చేతిలో కూడా పేలుతుంది. అలాగే ఈవీఎం ఇపుడు దొంగల చేతిలో ఉందనేది బాబు వ్యక్తంచేస్తున్న అనుమానం.