సాహోకి... కేటీఆర్ రివ్యూ వచ్చేసింది

June 01, 2020

కొందరు రాజకీయ నాయకులు పర్సనల్ లైఫ్ ని పట్టించుకోరు. ఇంకొందరు పర్సనల్ లైఫ్ ని బాగా ఇష్టపడతారు. అయితే కేసీఆర్ కుటుంబం మొత్తం... అటు రాజకీయాలు చేస్తూనే పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. రాజకీయాల్లో సినిమాలను ఇష్టపడే కొందరిలో కేటీఆర్ ఒకరు. వీలుకుదిరినపుడల్లా సినిమాలు చేస్తూ ట్విట్టరులో రివ్యూలు ఇస్తూ అలరిస్తుంటారు. సాధారణంగా కేటీఆర్ రివ్యూ లేటుగా వస్తుంది. సాహో సినిమాకు చాలా త్వరగా వచ్చేసింది. సినిమాలు చూడటం కేటీఆర్ వీకెండ్ వ్యాప‌కం. తాజాగా ఆయ‌న ఒకే రోజు రెండు సినిమాలు చూడటం విశేషం. ఎవరు సినిమా ఎపుడో వచ్చేసింది. కాకపోతే లేటుగా చూశారు. సాహోను మాత్రం త్వరగా చూసేశారు. తాను ఒకే రోజు ఈ రెండు చిత్రాలూ చూసిన‌ట్లు స్వయంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి వాటిపై ఆయన రివ్యూ ఏంటి?

రెండూ అద్భుత‌మైన సినిమాలే. సాహో టెక్నిక‌ల్‌గా బ్రిలియంట్ అనిపించింది. ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచింది. ప్ర‌భాస్, ద‌ర్శ‌కుడు సుజీత్‌ల‌కు అభినంద‌న‌లు...  అంటూ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. పబ్లిక్ టాక్ భయంకరంగా వచ్చినా కేటీఆర్ మొహమాటం లేకుండా తన ఫీడ్ బ్యాక్ చెప్పేశారు. ఇక ఎవరు గురించి మాట్లాడుతూ... ఈ సినిమా  స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంద‌ని.. అడివి శేష్‌, రెజీనా క‌సాండ్రా, న‌వీన్ చంద్ర అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చార‌ని ప్రశంసలు కురిపించారు కేటీఆర్.  

ఆయన రివ్యూలకు నెటిజన్ల నుంచి పంచ్ లు పడ్డాయి. మీరిలా సినిమాలు చూసి టైం వేస్ట్ చేస్తే ఎలా అని ఎక్కువమంది స్పందించారు. గతంలో కూడా ఇలాగే ఒకరు అడిగితే... ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది అంటూ గట్టిగా ఇచ్చారు కేటీఆర్. తాజాగా అలాంటి విమర్శలను లైట్ తీసుకున్నారు. అయితే... సాహోకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అలాంటి సినిమాను బాగుందని కేటీఆర్ మెచ్చుకుంటుంటే... ఎవరూ దానిని హేళన చేయకపోవడం విశేషం.