ఫన్నీ సైడ్ ఆఫ్ కేటీఆర్ !

August 11, 2020

డబ్బులున్న రాజకీయ నాయకుల కంటే మాటకారి తనం, చతురత ఉన్న నాయకులు ప్రజల్లో ఎక్కువ పాపులర్ అవుతారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ అదృష్టవశాత్తూ రెండూ ఉన్నాయి. ఇక ఫాలోయింగ్ లేకుండా ఎలా ఉంటుంది?  రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ మందిలో మాత్రమే హాస్యచతురత, స్పాంటెనిటీ ఉంటాయి. ఇవి కేటీఆర్ లో కొంచెం ఎక్కువే. తరచుగా తనలోని నవరసాలను ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు కేటీఆర్. తాజాగా మరోసారి ఓ నెటిజన్ కు సెటైరిక్ రిప్లై ఇచ్చారు. 

శరత్ అనే నెటిజన్ ఏమన్నాడంటే.. "కేటీఆర్ సర్..  ఏప్రిల్ 20 తర్వాత బార్బర్ షాపులు, సెలూన్లు తెరిచే ఆలోచన ఏదైనా ఉందా? ఎందుకంటే నాకు క్రాఫ్ చేయాలని నా భార్య ఎంతో తహతహలాడిపోతోంది. అదే గనుక జరిగితే మీరు లాక్ డౌన్ ఎత్తేసినా నేను ఇంటికే పరిమితమైపోతానని గట్టి నమ్మకం" అంటూ ట్వీట్ చేశాడు. 
దీనిని రీట్వీట్ చేసిన కేటీఆర్...  "హేయ్, విరాట్ కోహ్లీ యే తన భార్యతో క్రాఫ్ చేయించుకుంటుంటే నీకేమైంది?" అంటూ రిప్లై ఇచ్చాడు. 

మొన్న మరో నెటిజన్ ఇలాగే సార్... ’’టీవీ వాళ్లకు చెప్పి కొంచెం మంచి సినిమాలు వేయించండి సార్. ఇంట్లో మా ఆవిడతో ఇబ్బందిగా ఉందంటూ ట్వీట్ చేస్తే.... మీ ఆవిడ ట్విట్టరులో లేదనుకుంటాను‘‘ అంటూ రిప్లై ఇచ్చాడు.

ఆ మధ్య రాంగోపాల్ వర్మ బెంగాల్లో లాగ మాకు కూడా మందు డోర్ డెలివరి చేసే ఆలోచన ఏదైనా ఉందా అంటే... చాలా చమత్కారంగా మీరు హెయిర్ కట్ గురించి అడుగుతున్నారా రాము గారు అంటూ సర్కాస్టిక్ గా టాపిక్ డైవర్ట్ చేశాడు కేటీఆర్. 

ఈ మధ్య కేటీఆర్ నవరసాలు పలికిస్తున్నాడు. ఒకవైపు అవసరమైన వారిని ఆదుకుంటు, అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తూ... ఇబ్బుందులో సహకరిస్తూ... సీరియస్ సిచ్యుయేషన్లోను ఇలాంటి సరదా రాయుళ్లతో మాటలాడుతూ చెలరేగిపోతున్నారు. ఈరోజు ఒక గ్రామంలో ఎవరికో టాబ్లెట్లు కావాలి అని ట్వీటు పెడితే హైదరాబాదులో మాత్రమే దొరికే ఆ టాబ్లెట్లను సాయంత్రానికి వారికి అందజేసేలా ఏర్పాట్లు చేసి పలువురి మనసు దోచాడు. తెలుగు రాష్ట్రాల్లో ట్విట్టరులో మోస్ట్ యాక్టివ్ పొలిటీషియన్ గా మారిపోయారు కేటీఆర్.