కేటీఆర్‌..త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తి

July 11, 2020
CTYPE html>
`త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తి` ఇది ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు వ‌ర్తిస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయ‌న మీడియాతో స‌న్నిహితంగా ఉండ‌టంతో పాటుగా...సోష‌ల్ మీడియాలో ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలోనే దానికి సంబంధించిన ప్రశ్నలు మీడియా ఎక్కడా అడుగుతారో అన్న సందేహంతోనే ఆయన పాత్రికేయులను దూరంగా ఉంటున్నారు.ఆర్టీసీ సమ్మెకి సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని కేటీఆర్‌ భావించి ఇటు గ‌ల్లీలోనూ...అటు ఢిల్లీలోనూ..ఆయ‌న మీడియా వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు.
ఇటీవ‌ల కేటీఆర్ ముఖ్య‌మైన ఎజెండాతో ఢిల్లీలో ప‌ర్య‌టించారు.తొలిరోజు కేటీఆర్‌ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని కలిసి హైదరాబాద్‌లో నిర్మించనున్న స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల మంత్రుల వర్క్‌షాప్‌ సమావవేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌- బెంగళూరు- చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచన చేశారు. కేంద్ర పట్టణాభివద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దిప్‌ సింగ్‌ పూరితో మంత్రి కేటీఆర్‌ సమావేశమై తెలంగాణ శానిటేషన్‌ హబ్‌ ఏర్పాటుకోసం సహకరించాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహ కరించాలని పీయూష్‌ గోయల్‌ని కోరారు. కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షాతో సైతం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇంత లాంగ్‌ షెడ్యూల్‌తో ఢిల్లీ వచ్చిన కేటీఆర్‌ విలేకరులను కలుసుకోకపోవడం పట్ల అనుమానాలకు తావిస్తున్నాయి. ఆయనతో భేటీతో కావాలని మీడియా ప్రయత్నించినా చివరికి నిరాశే ఎదురైంది.
ఢిల్లీలో కేవలం పత్రికా ప్రకటనలు... ట్విట్టర్‌ పోస్టులకే పరిమితమై ఆయన కనీసం ఢిల్లీ మీడియానూ కలుసుకోలేదు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన నేపథ్యంలో మీడియా పడిగాపులు కాసినా మంత్రి ముఖం చాటేసిన పరిస్థితి నెలకొంది. కేటీఆర్‌ ఏ కేంద్రమంత్రిని కలిసినా... ఆయన మీడియాకు వివరించిన దాఖలాల్లేవు. సాధారణంగా ఏ క్యాబినెట్‌ మంత్రి అయినా.. ఢిల్లీకి వచ్చాక.. మీడియాతో మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. మాట్లాడని పక్షంలో కనీసం ఇష్టాగోష్టిలో అయినా పాల్గొంటారు. కానీ, మంత్రి కేటీఆర్‌ మాత్రం ఢిల్లీ అందుకు భిన్నంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్ర‌మాల్లోనూ ఆయ‌న మీడియాతో ముచ్చ‌టించ‌డం లేదు. ఇష్టాగోష్టిగా మాట్లాడేందుకు జ‌ర్న‌లిస్టులు ప్ర‌య‌త్నించ‌గా...``మీరు ఏం చ‌ర్చిస్తారో తెలుసు...దానిపై మ‌ళ్లీ   మాట్లాడుకుందాం`` అని దాట‌వేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర రాజ‌ధాని నుంచి మొదలుకొని ఢిల్లీ వ‌ర‌కు కేటీఆర్ ముఖం చాటేయ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది.