గాసిప్ వైరల్... కేటీఆర్ వార్నింగ్?

August 07, 2020

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కంటే కూడా ముఖ్యమంత్రి కుమారుడు అన్న పేరుతోనే కేటీఆర్ ఎక్కువ కనెక్ట్ అవుతారు.

భవిష్యత్తులో తండ్రి తర్వాత కొడుక్కే రాజ్యాధికారాన్ని అప్పగిస్తూ పట్టాభిషేకం చేస్తారన్న మాట తరచూ కొందరి నోటి నుంచి వస్తుంటుంది.

ఇప్పటికి ఇప్పుడే ఇవేమీ జరగవన్నది నిజమే అయినా..  యువరాజు యువరాజేగా అన్న మాట గులాబీ నేతల ప్రైవేటు సంభాషణల్లో  వినిపిస్తూ ఉంటుంది.

అదే సమయంలో మంత్రి కేటీఆర్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని చెబుతారు. అనవసరమైన మాటల్ని మాట్లాడకుండా ఉండటం.. సీనియర్ నేతల్ని అన్నా అంటూ పిలుస్తూ.. అందరి మన్ననలు పొందుటంలోనూ  తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతారు.

వివాదాలకు దూరంగా ఉండటం.. వివాదాస్పదంగా వ్యవహరించే వారు తనకు దగ్గరగా ఉంటే.. ఘాటు వార్నింగ్ లు ఇచ్చేసి.. తీరు మార్చుకోవాలని చెబుతారంటారు.

తండ్రి అంటే విపరీతమైన భయభక్తులతో పాటు.. ఆరాధనాభావం కూడా ఎక్కువని చెబుతారు. మరో రెండు రోజుల్లో (జులై 24) కేటీఆర్ పుట్టినరోజు.

ఇవాల్టి రోజున కీలక నేతల పుట్టినరోజుల్ని భారీగా నిర్వహిస్తున్నారు. అయితే.. కరోనా వేళ.. ప్రేమాభిమానాలు ప్రదర్శించటం కోసం పెద్ద ఎత్తున హడావుడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ముందే అలెర్టు అయిపోయారు కేటీఆర్.

తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారందరికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం పరిస్థితులు ఏమీ బాగోని నేపథ్యంలో పుట్టినరోజు పేరుతో ఎలాంటి హడావుడి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

సంబరాలకు సమయం కాదని.. అలా చేస్తే ప్రజల్లో చులకన కావటమే కాదు.. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని వివరించటమే కాదు..హడావుడి చేసే సన్నిహితులకు తిప్పలు తప్పవని చెప్పేసినట్లుగా తెలుస్తోంది.

కేటీఆర్ వార్నింగ్ తో.. పుట్టిన రోజు సందర్భంగా కాసింత హడావుడి చేయాలనుకున్న వారంతా పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు.