కరోనా పోదు... కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు 

August 14, 2020

భరోసా నింపాల్సిన నాయకుల్లోను భరోసా లేకుండా చేసింది కరోనా. చివరకు క్లారిటీ వచ్చేసింది. కరోనా ఇప్పట్లో పోయే రోగం కాదని... దాని నుంచి ఎక్కువ కాలం దాక్కోలేమని జాగ్రత్తగా ఎదుర్కొంటూ బతకాల్సిందే అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ వస్తేనే కరోనా నుంచి మనకు విముక్తి దొరుకుతుందని మంత్రి కేటీ రామారావు అన్నారు.

తెలంగాణలోని పురపాలక సంఘాల మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తేయక తప్పదు. ఆ తర్వాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోవడమే మన ముందున్న మార్గం అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.

  1. వ్యాప్తిని వీలైనంత అడ్డుుకునేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనింలి.
  2. పురపాలక శాఖ ఆరోగ్య శాఖతో కలిసి తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్‌ ను పక్కాగా ఫాలో కావాలి. దాని ఆధారంగా చర్యలు చేపట్టాలి.
  3. వర్షాకాలంలో  వచ్చే డెంగ్యూ వంటి వ్యాధుల నివారణపైన చర్యలు చేపట్టాలి. ఇతర వ్యాధులను ఉన్నవారిని కరోనా ఇబ్బంది పెడుతుంది.
  4. యాంటీ లార్వా ఆక్టివిటీస్ (దోమలపై యుద్ధం... దీనిని చంద్రబాబు చేస్తే వైసీపీ వాళ్లు ఎగతాళి చేశారు. కేటీఆర్ పేరు మార్చారు అంతే) ప్రత్యేక కార్యక్రమాన్ని తిరిగి రేపటి నుంచి ప్రారంభించండి.
  5. ప్రతి పట్టణంలో మురికి కాలువలను పరిశుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ కార్యక్రమాలను ప్రారంభించాలి.
  6. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలి. వారికి మాస్కులు, గ్లౌజులు కచ్చితంగా ఇవ్వాలి.