కూకట పల్లికి షాక్ - తెలంగాణలో కొత్త రికార్డు

May 28, 2020

మధ్యలో ఒక రెండు వారాలు శాంతించిన కరోనా తెలంగాణలో పెరుగుతూనే ఉంది. ఈరోజు ఏకంగా 38 కొత్త కేసులు రావడంమే కాదు... ఒక్కరోజులోనే 5 మంది చనిపోయారు.  ఒక్కరోజే ఐదుగురు మృత్యువాత పడడం తెలంగాణలో ఇదే తొలిసారి. దీంతో ప్రభుత్వ వర్గాల్లో, ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 45కి పెరిగింది.
రోజూ కేవలం GHMCలోనే నమోదవుతున్న కేసులు తాజాగా రంగారెడ్డి జిల్లాలో 2 నమోదు కావడం గమనార్హం. కూలీల్లో 10 మందికి సోకింది. ఈరోజు 23 మంది డిశ్చార్జి కావడంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,036కి చేరగా... రాష్ట్రవ్యాప్తంగా 618 మంది ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. 

మరోవైపు ఈరోజు హైదరాబాద్ లోని అత్యంత రద్దీ ప్రదేశాలలో ఒకటైన కుకట్ పల్లిలో 5 కేసులు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యాపారాలు, విద్యా సంస్థలకు కేంద్రంగా ఉన్న కూకట్ పల్లి లో కేసుు రావడం ఐటీ వర్గానికి ఆందోళన కలిగిస్తోంది.  పైగా అనేక ఎన్నారై కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే కూకట్ పల్లి కేసులు ఎన్నారైల్లో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 

రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక వైద్యుడు, అతడి తండ్రికి సోకింది.  ఈ వైద్యుడు అపోలో ఆసుపత్రిలో పనిచేస్తారు. దీనితో అప్రమత్తమైన అధికారులు రెయిన్బో విస్టా అపార్టుమెంటులలో పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. కాంటాక్ట్ ట్రేసింగులను పరీక్షిస్తున్నారు. మరో మూడు కేసుల్లో అల్లాపూర్ నుండి ఒకటి,  బుబ్బగుడ లో ఒకటి నిర్దారించారు.