పోలీస్ పాత్రలో బిగ్ బాస్ కౌశల్... కానీ

August 03, 2020

Bigg Boss 2 Telugu winner Kaushal Manda : బిగ్ బాస్ 2 తెలుగు *విజేత*గా నిలిచిన తరువాత నటుడు కౌశల్ చిత్ర పరిశ్రమలో తనకు భారీ ఆఫర్లు వస్తాయని భావించారు. ఎందుకంటే ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ మొత్తంలో అత్యంత ఎక్కువ చర్చ జరిగింది అతని గురించే. అయినా... అతని ఆశలు అడియాశలయ్యాయి. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ అతనికి చెప్పుకోదగ్గవే కాదు సాధారణ అవకాశాలు కూడా రాలేదు. అయితే తాజాగా ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత, కౌశల్ మారుతితో తన మొదటి సినిమాను ప్రకటించాడు. అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పవన్‌కళ్యాణ్‌ బయోపిక్‌లో చేస్తాడని ఒక గాసిప్ వచ్చింది. అది గాసిప్ గానే మిగిలిపోయింది. ఇక ఆశలు ఆవిరి అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఒక తెలుగు సినిమా అవకాశం వచ్చింది. అందులో అతను పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తున్నారు.

ఆది సాయికుమార్ రాబోయే చిత్రంలో కౌశల్ ఒక పోలీసు పాత్రలో కనిపించనున్నారు. జిబి కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మహంకాళి క్రియేషన్స్ బ్యానర్లో మహంకలి దివాకర్ దీనిని నిర్మిస్తున్నారు.