భారత్ - చైనా : ముగ్గురు భారతీయ సైనికులు మృతి

August 11, 2020

లడఖ్ ప్రాంతంలోని భారత్ చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో నిన్న రాత్రి జరిగిన ఘర్షణలో ఒక సైనిక అధికారి, ఇద్దరు సైనికులు చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది. గాల్వన్ వ్యాలీ నుంచి సైనికుల ఉపసంహరణ సందర్భంగా ఈ ఘర్షణ చెలరేగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే ఓ సారి భారత చైనా సరిహద్దులో కొంతకాలం క్రితం గొడవలు జరిగాయి. అప్పట్లో అమెరికా కూడా జోక్యం చేసుకుంది. అయితే, ఇరు దేశాలు చర్చలు దానిని ఒక కొలిక్కి తెచ్చుకున్నాయి. తాజాగా మరో గొడవ జరిగింది.

తాజా ఘర్షణలో చైనా సైన్యం కూడా గాయపడిందని... ఎవరికి ఏమైంది అన్న వివరాలు తెలియరాలేదని భారత్ పేర్కొంది. 

ఇరు దేశాలకు చెందిన సైన్యాధికారులు ఘర్షణ జరిగిన ప్రాంతంలోనే సమావేశమై దీనిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు భారతదేశం వెల్లడించిన ఒక ప్రకటనలో తెలిపింది. చైనా మాత్రం మన వాళ్లు సరిహద్దులు దాటి వెళ్లి వారితో గొడవ పడినట్లు ప్రకటన వెలువరించింది.

చైనా ఇప్పటికే ప్రపంచంతో ఒంటరైంది. శాంతి చర్చలు అంటూనే భారత్ ను గిల్లుతోంది.