విజయవాడలో దేశద్రోహులు !

February 19, 2020

విజయవాడలో ఈరోజు అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. దేశం మొత్తం... కాశ్మీర్ విభజన, విలీనం విషయంలో సంబరాలు చేసుకుంటూ ఉంటే... విజయవాడలో కొందరు అరెరె కాశ్మీర్ కి అన్యాయం చేస్తారూ అంటూ కొవ్వొత్తులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు.
కాశ్మీర్ లో మన సైనికులకు, మన దేశీయులకు అన్యాయం జరిగినపుడు అక్కడ మన జెండాను కాల్చినపుడు, మన రాజ్యాంగాన్ని తగలబెట్టినపుడు ఏ నిరసన చేయని వారు... ఇపుడు ఎలా నిరసనకు దిగారు అంటూ ఈ నిరసనను చూసిన ప్రజలు విమర్శించారు.
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును అత్యధిక రాజకీయ పక్షాలు సాదరంగా ఆహ్వానించాయి. ఏపీలోని ప్రజా సంఘాలు మాత్రం దీనిని తప్పుబడుతున్నాయి. విజయవాడలో వీరంతా ఏకమై కొవ్వొత్తులతో ర్యాలీ చేశాయి. 40 ఏళ్ల సమస్యను నాలుగు గంటల్లో చర్చ లేకుండా ఎలా తీర్మానిస్తారని దేశాన్ని ప్రశ్నించాయి. రాజ్యాంగ బద్దంగా చేసిన చట్టాలను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారని.. కేంద్రం చర్యలు కాశ్మీర్ ప్రజలకు నష్టం కలిగించేలా ఉన్నాయని ప్రజా సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. మోడీ మొండి వైఖరిని ప్రజలందరూ ఖండించాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ నిరసన పై విజయవాడలో దేశద్రోహులు అంటూ కామెంట్లు చేశారు. కాశ్మీరీల హక్కులు ఏం హరించారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇపుడు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కులు ఇపుడు కాశ్మీరీలకు ఉన్నాయని... అందులో ఏం అన్యాయం జరిగిందని వారిని నిలదీస్తున్నారు. కాశ్మీరీకు ఇంకా మేలే జరుగుతుందని.. ఇక నుంచి అక్కడికి పెట్టుబడులు వస్తాయన్నారు. 

Read Also

పదవి ఇచ్చినా... పృథ్వీలో అసంతృప్తి ఎందుకు....?
ఆర్టికల్ 35ఏలో ఏముంది? దాన్ని ఎందుకు రద్దు చేశారు?
బాబుపై ఇద్దరు సీఎంల రాజకీయం.. టార్గెట్ 6 నెలలు !