19 లగడపాటి షో రిలీజ్ - భారీ ట్విస్ట్ కూడా ఉంది

August 06, 2020

దేశ వ్యాప్తంగా సర్వేల విషయంలో లెక్కతప్పని సర్వేరాయుడు లగడపాటి రాజగోపాల్... మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. అసల లగడపాటి సర్వేకి పూర్తి రివర్స్ రిజల్టు వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే... పోలింగ్ కు ముందే లగడపాటి సర్వే వెల్లడించడం చాలా అరుదు. అది కూడా తెలంగాణ ఎన్నికల్లో జరిగింది. ఫలితాలు వచ్చాక లగడపాటి కి ఎంత పెద్ద షాక్ తగిలిందంటే... కొన్ని రోజులు ఆయన మీడియాకు కూడా కనిపించలేదు. అది లగడపాటికే కాదు. అందరికీ షాకే. ఆ దెబ్బకు ఇప్పటికీ కోలుకోని రాజగోపాల్ ఈసారి చాలా జాగ్రత్త పడ్డారు. ఏపీ ఎన్నికలు ముగిసినా దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగిసే వరకు సర్వే విడుదల చేసే ప్రసక్తి లేదని తేల్చేశారు.
మరి 19 మే, 2019న ఆయన ఎన్నికల ఫలితాలపై తన ఎగ్జిట్ పోల్ ప్రకటిస్తారట. లోక్ సభ ఎన్నికలవి కూడా ప్రకటించనున్నారు. చెడిపోయిన తన బ్రాండ్ నేమ్ ని తిరిగి తెచ్చుకునే ప్రమయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉన్నారు. తాజాగా లగడపాటి రాజగోపాల్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి తెలుగు వారు ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి ఆయన హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన ఎగ్జిట్ పోల్స్ వెల్లడి గురించి మాట్లాడారు. ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు.
ఆ ట్విస్ట్ ఏంటంటే... త‌న ఆర్జీ ఫ్లాష్ టీంతో చేయించిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో పాటు అదే రోజున మ‌రో అంశాన్ని చెబుతాన‌ని అన్నారు. ఇంతకీ అదేంటో తెలుసా? తెలంగాణ ఫ‌లితాల్లో త‌న అంచ‌నా త‌ప్ప‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా వెల్లడిస్తారట. మొత్తానికి లగడపాటి బాగా హర్టయినట్టున్నారు. కాదు కాదు... ప్లాన్డ్ గా కేసీఆర్ అందరినీ హర్ట్ చేసినట్టున్నారు. ఆయన ఈ మాట చెప్పిన నేపథ్యంలో లగడపాటి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల కంటే కూడా తెలంగాణ‌ ఫలితాల గురించి ల‌గ‌డ‌పాటి ఏం చెప్పబోతున్నాడా అని జనాలు ఉత్కంఠతో ఎదురుచూసే పరిస్థితి.