లక్ష్మీపార్వతి సర్ ప్రైజ్ పదవి !

July 05, 2020

ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతికి జగన్ పదవి ఇచ్చారు. లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

తనకు అనుకూలమైన నేతలకు, తనతో కలిసిన నడిచిన నేతలకు పదవులు ఇచ్చిన జగన్... చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మాత్రమే లక్ష్మీపార్వతిని ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు. కమ్మ సామాజిక వర్గాన్ని చాలా దూరంగా పెట్టిన జగన్... యాంటీ బాబు కోటాలో ఆమెకు పదవిచ్చినట్లు అనుకోవచ్చు.

ఆమెకు ఇక పదవి దక్కదు అని విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రచారాన్ని ఆపడానికి అన్నట్లు ఆమెకు పదవి ఇచ్చారు జగన్. తెలుగు అకాడమీ పదవి ఆమెకా అని చాాలా మంది విస్మయం చెందుతున్నారు. కానీ ఏమాటకు ఆమాటే... ఆమెకు సాహిత్యంలో కొంచెం ప్రవేశం ఉంది. తెలుగు భాషపై పట్టుంది. ఎన్టీఆర్ ఆమెకు దగ్గరవడానికి కారణాల్లో ఇదొక్కటి.