వారినీ ఎలాంటోడు ఎలా అయిపోయావు సామీ

May 26, 2020

2019 ఎన్నికలు చాలా స్పెషల్.... ఈ సారి గెలుపులు గెలుపుల్లా లేవు. ఓటములు ఓటముల్లా లేవు. ఆ గెలుపుల మీద, ఈ ఓటముల మీదా అనుమానాలు చాలా ఉన్నాయి. ఏమీ చేయకుండా ఒకాయన గతంలో కంటే ఎక్కువ సీట్లు కొట్టేశారు. ఏం చేస్తాడో తెలియని వ్యక్తి చరిత్రలో లిఖించే విజయం సాధించాడు. దేశమంతటా ఇదే పరిస్థితి. కమ్యూనిస్టుల కోటలో భక్త్ లకు భారీగా ఓట్లు పడటం, అమేథీలో గాంధీ కుటుంబం ఓడటం, మొన్నే ఛీకొట్టిన రాష్ట్రాల్లో బీజేపీని జనం మళ్లీ వెంటనే ప్రేమించడం... ఏమిటో ఇవన్నీ. వింతలు విచిత్రాలు.

పాపం ఈ విచిత్రాలు అర్థం కాక ఒకపుడు దేశాన్ని రాజకీయంగా ఊపేసిన లాలూ ప్రసాద్, సమోసాలో ఆలూ ఉన్నంతవరకు, బీహార్ లో లాలూ ఉంటాడని చెప్పిన లాలూప్రసాద్ అడ్రెస్ లేకుండా పోయాడు. ఎన్నికల్లో ఈ ఊహించని దెబ్బకు పాపం అన్నం తినడం మానేశాడట. డాక్టర్లు లబోదిబోమంటున్నారు. స్వామీ మీరు అన్నం తినకపోతే మేం మందులు ఇవ్వలేం. దయచేసి అన్నం తినండి అంటున్నారట డాక్టర్లు.

ఎంత మోడీ హవా ఉంటే మాత్రం మాకు ఒక్క సీటు రాదా.. అంటూ కుంగిపోతున్నాడట ఆర్జేడీ అధినేత. పాపం ఆయనను ఓదార్చేవారెవరు? బీహార్ లో మొత్తం 40 లోక్ సభ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమి 39 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆర్జేడీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఎన్డీయే కూటమిలో బీజేపీ-లోక్ జనశక్తి పార్టీ- జేడీయు ఉన్నాయి.