షాకింగ్ కామెంట్ చేసిన ఏపీ డీజీపీ !

August 12, 2020

ఏపీ పోలీసలు ఇన్ని రోజులు ప్రశ్నించిన వారి పైనా, ప్రత్యర్ధి పార్టీ వారి పైనా కేసులు పెట్టి అరెస్టులు చేయడమే ధ్యేయంగా పనిచేశారు. ఇప్పుడు మాత్రం తప్పు చేసిన వాళ్లని అరెస్ట్ చేయడం మీ ప్రాధాన్యత కాదు.. అని చెప్పారు. ఈ మాట చెప్పిందో ఎవరో కాదు. స్వయంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ వ్యాఖ్యచేశారు.

డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఓ మీడియాలో ప్రసారం అయ్యాక వైరల్ అయ్యాయి. ఏ కంపెనీ తప్పు చేసినా, ఏ మనిషి తప్పు చేసినా శిక్షించాల్సింది చట్టం, కేసు పెట్టాల్సింది పోలీసే. కానీ అది మా ప్రాధాన్యం కాదు అని డీజీపీ చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బహుశా అందుకే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చీమ కుట్టినట్టు కూడా లేకుండా ప్రశాంతంగా ఉంది. ఈరోజు మృతదేహాలతో కంపెనీ ముందు ధర్నా చేస్తే గాని స్పందించలేదు. ముఖ్యమంత్రి ఏమో కంపెనీ త్వరలో ఓపెన్ అవుతుంది, ఉద్యోగాలిస్తాం అంటున్నారు. తమ సొంత మనుషులను చంపిన వాడి వద్ద పోయి ఎవరైనా పనిచేయగలరా? అంటే ఇది ఎలా ఉంటుందంటే... రేప్ చేసిన అమ్మాయిని పెళ్లాడి జీవితం ఇస్తాను అన్నట్టుంది.

మనుషుల ప్రాణాలు పోయింది కంపెనీ కారణంగా.... జీవితాంతో ఆ కంపెనీ ఆ కుటుంబాలను ఉత్తినే పోషించాలి వాస్తవానికి. విదేశాల్లో అయితే ఇలాంటి తీర్పులే వస్తాయి. కానీ వాడి కిందే పనిచేసి జీతం తీసుకోవాలట. ఇంతకంటే దారుణమైన ఆఫర్ ఏమైనా ఉంటుందా? పోనీ ఏదైనా గవర్నమెంటు ఉద్యోగం ఇస్తాం అంటే అది ఒక పద్ధతి. కానీ హంతకుడి వద్దే పని ఇప్పిస్తే అదేమైనా శాశ్వతంగా నిలబడుతుందా?

 

ముఖ్యమంత్రి, డీజీపీ అసలు ఎల్జీ పాలిమర్స్ ను హెచ్చరించకపోతే.... వారు ఎందుకు భయపడతారింక? అసలు వీరికి ఆ కంపెనీపై అంత ప్రేమ ఎందుకు?