​జగన్ పై చంద్రబాబు సంచలన ఆరోపణలు

August 06, 2020

ఈరోజు తన తప్పులపై దర్యాప్తు చేయకుండా ఎన్జీటీని, 50 కోట్లు కట్టమని చెప్పిన హైకోర్టును నియంత్రించాలని కోరుతూ సమాజం సిగ్గు పడే కారణాలతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమర్స్  కు గట్టి షాక్ తగిలిన విషయం తెెలిసిందే. మీ కంపెనీలో ఏం జరిగిందో తెలుసుకుని కారణాలు అన్వేషించాల్సిన బాధ్యత, హక్కు ప్రభుత్వానికి ఉంది. ​మీ పిటిషను కొట్టేస్తున్నాం. మీరే చెప్పేవన్నీ ఎన్జీటీ కోర్టులో, హైకోర్టులో చెప్పుకోండి అంటూ సుప్రీంకోర్టు ఎల్జీ పాలిమర్స్ కు షాక్ ఇచ్చింది. తాజాగా చంద్రబాబు ఈ విషయంపై స్పందించారు. 

ఎల్జీ పాలిమర్స్ కు జగన్ అండగా నిలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే కేటగిరి మార్చారని ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక వైసీపీ హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఆ కంపెనీకి తాను పర్మిషన్లు ఇచ్చినట్టు నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారని... వాస్తవానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 4 సార్లు ఆ కంపెనీకి పర్యావరణ అనుమతులు ఇచ్చారని చంద్రబాబు వివరించారు.

అసలు ఆ కంపెనీలో పాలిస్టైరీన్ ఉత్పత్తికి టీడీపీ సర్కారు అనుమతే ఇవ్వలేదని... దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అన్నారు. టీడీపీ హయాంలో LG polymers కంపెనీకి ఒక్క ఎకరా కూడా కేటాయించలేదన్నారు. 

ఇక విద్యుత్ ఛార్జీల పెంపుపై కూడా చంద్రబాబు సంచలన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రతి తెలుగుదేశం నేత తమ తమ ఇళ్లలో దీక్షలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఛార్జీలు పెంచను అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా అన్ని ఛార్జీలు బాదుతున్నారన్నారు. ఫిబ్రవరి బిల్లులు ఎంతొచ్చాయో సరిగ్గా అంతే మొత్తం తర్వాత మూడు నెలలకు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.