ఏపీ సర్కారుకు సెగ- మా జీవితాలను డబ్బుతో కొంటారా?

August 14, 2020
CTYPE html>
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నిర్లక్ష్యంతో మా జీవితాలు ఆగమైపోయాయి. మా ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోయాయి. భవిష్యత్తులో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. మా ఆరోగ్యం పరిస్థితి పట్టించుకోకుండా పది కోట్లు ఇస్తాం, 30 కోట్లు ఇస్తామంటూ మా జీవితాలతో బేరాలాడుతారా? అంటూ వైజాగ్ శివారులోని RR వెంకటాపురం ప్రాంతంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కంపెనీపై చర్యలు తీసుకోవాలి. మాకు ఆరోగ్య పరీక్షలు చేయాలి. మా జీవితాలకు, మా పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. వెంటనే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటూ స్థానిక ప్రజలు ధర్నాకు దిగారు. దీనిపై తెలుగుదేశం నేత నారా లోకేష్ స్పందించారు. 
మా సమస్యలు పట్టించుకోండి, వెంటనే పరిష్కరించండి అంటూ యువకులు ఆందోళన చేస్తుంటే...వారిని అడ్డుకుని ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తొత్తుల్లా పనిచేస్తారా? ఇది పెద్దలను కాపాడే ప్రభుత్వమా? ప్రజలను పాలించే ప్రభుత్వమా? అని ముఖ్యమంత్రి జగన్ ను లోకేష్ నిలదీశారు. 
 
యువకుల ధర్నా వీడియో లింకు: https://twitter.com/i/status/1259003006667812865
లోకేష్ ట్వీట్ :
ఎలాంటి మెడికల్‌ క్యాంపులు లేవు, షల్టర్లు లేవు, అంతా కలుషితం అయిపొయింది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మా సమస్యలు పరిష్కరించండి, అని స్థానిక యువత ఆందోళన తెలుపుతుంటే వారిని అడ్డుకొని కంపెనీకి తొత్తుల్లా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం మంచిది కాదు.  ఇన్ని సమస్యలు ఉంటే, @ysjagan  గారు పది కోట్లు ఇస్తాం, 30 కోట్లు ఇస్తామని చెప్పి డబ్బు తో చూస్తున్నారని, స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటే, వారి ఆవేదన అర్ధం చేసుకోలేక పోవటం దారుణం.​​