ఎన్జీటీ సంచలన తీర్పు - ఎల్జీ పాలిమర్స్ మైండ్ బ్లాక్ !  

August 06, 2020

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పట్టడం పక్కనుంచితే 12 నిండు ప్రాణాలు పోయాయి. ఇంకెన్నో జీవితాలు నరకంలో పడ్డాయి. తిండి విషమైంది. ఇల్లు నరకమైంది. ఆ ఘోరకలిని తలచుకుంటేనే ఇప్పటికీ వెన్నులో వణుకొస్తుంది. అది ఎంత పెద్ద ఘోరమో మన ముఖ్యమంత్రికి అర్థం కాలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి, సంబంధమే లేని చంద్రబాబును తిట్టి, అమానవీయంగా ఆ ఊళ్లో ఉత్సవాలు జరిపారు. అది కూడా కరోనా సమయంలో.. ఉత్సవాలతో జగన్ కి కావాల్సిందేమిటో అర్థమైంది.

కానీ జగన్ సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఎన్జీటీ ఊరుకోదుగా.. ఈరోజు ఉతికారేసింది. LG polymers కేసులో తన తొలి తీర్పును NGT వెలువరించింది. ఇందులో ఒక్కక్కటీ చదవుతుంటే... ఇది అక్కడి ప్రకృతికి మనుషులకు చేయాల్సిన న్యాయం అనిపించేలా అత్యంత కఠిన విధానాలతో తన తీర్పు ఇచ్చింది ఎన్జీటీ.

1. అనుమతులు, సామర్థ్యం లేకుండా కంపెనీ నడవడానికి అనుమతి ఇచ్చిన ఆ పనికిమాలిన అధికారిని పట్టుకుని శిక్షించాలి. ఇది రెండు నెలల్లోపు జరగాలి. ఎలా శిక్షించిందీ మాకు నివేదిక రావాలి. ఇది స్వయంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేయాలి.

2. LG polymers డిపాజిట్ చేసిన 50 కోట్లు అక్కడ పర్యావరణ పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాలి.

3. పర్యావరణ పునరుద్ధరణ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఒకరు, పీసీబీ నుంచి ఒకరు... వీరితో పాటు విశాఖ కలెక్టరు ఉండాలి. దీని పర్యవేక్షణ బాధ్యత కేంద్ర పర్యావరణ శాఖది.

4. బాధితులకు పరిహారం నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వెయ్యాలి. 

5. భారత ప్రభుత్వం ప్రకారం సకల అనుమతులు సక్రమంగా తెచ్చుకునేవవరకు కంపెనీ తిరిగి ప్రారంభం కాకుండా చూడాలి.

6. LG polymers ప్లాంట్లో పర్యావరణ నిబంధనల తనిఖీకి మరో ప్రత్యేక కమిటీ వెయ్యాలి. 

ఇలా ప్రతి దానికి పకడ్బందీగా కమిటీలు వేసిన ఎన్జీటీ వాటికి రెండు నెలల కాల పరిమితి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశిత సమయంలేనే ఈ పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించడం విశేషం.