ఎల్జీ పాలిమర్స్ - అమ్మదొంగా చాలా మతలబుందే !

August 05, 2020

నాలుగు రోజుల్లోనే 30 కోట్ల పరిహారాన్ని జగన్ పంచేశారు. ఆయనది ఎంత పెద్ద మనసు అన్న భజన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వాస్తవానికి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కచ్చితంగా ప్రటి మనిషికి, ప్రతి మొక్కకి పరిహారం కట్టించి తీరాల్సిందే. ఇందులో మినహాయింపులుండవు. దీన్నుంచి ఆ కంపెనీ తప్పించుకోలేదు. ఈ ధైర్యంతోనే జగన్ చటుక్కున ఖజానాలో డబ్బులు తీసి జనాలకు ఇచ్చేశారు.

బాధితులకు డబ్బులు ఇవ్వడం మంచిదే. కానీ గత ప్రమాదాల్లో లేని వేగం ఈ ప్రమాదం విషయంలోనే ఉండటానికి కారణం ఏంటంటే... ఆ కంపెనీ అనుమతుల్లేకుండా నడవడానికి వైసీపీ సర్కారు సహకారం ఉండటం ఒకటైతే, పరిహారం ఇచ్చిన దానికంటే ఎక్కువగా గవర్నమెంటుకు తిరిగివస్తుంది.

ఈ పరిహారం గోల పక్కన పెడితే... ఇంతవరకు మీరు రకరకాల ప్రకటనలు, వార్తలు, టీవీల సమాచారాన్ని సేకరిస్తే ఈ అనుమానాలు అందరికీ కలుగుతాయి. ఒక నెటిజన్ వెలిచ్చిన సందేహాలకు ఎవరైనా సమాధానం చెప్పగలరా? కచ్చితంగా అక్కడేదో మతలబు ఉంది. అదేంటో అర్థం కావడం లేేదు.

 

1. LG polymers లో ఎన్ని స్టోరేజ్ ట్యాంక్ లున్నాయి? 

పేపర్లలో వచ్చిన చిత్రాలు కథనాల ప్రకారం 2 ట్యాంకులున్నాయి. ఒకటి 2500 tons కెపాసిటీ మరొకటి 3000 tons కెపాసిటీ. రెండవ ట్యాంక్ విస్తరణలో భాగంగా నిర్మించారు. అంటే మొత్తం స్టోరేజ్ కెపాసిటీ 5500 టన్నుల కెపాసిటీ. కానీ కొన్ని చిత్రాలలో మొత్తం 3 ట్యాంకులు కన్పిస్తున్నాయి.

2. అందులో ఎంతమేర మొన్నటి ఘటనలో వాయు రూపం చెంది పరివర్తనం చెందింది ఎంత మిగిలి వుంది?

కధానాల ప్రకారం 60 శాతం మేర (2500 టన్నుల కెపాసిటీ లో) ఈ విధంగారూపాంతరం చెంది మిగిలినది సుమారు 1000 టన్నులు. రెండవ ట్యాంక్ తో కలుపుకుని మొత్తం 4000 టన్నుల మేర నిల్వలు ఉండాలి.

మూడవ ట్యాంక్ ఉంటే దాని కెపాసిటీ కూడా కలుపుకుని (అది కూడా 3000 టన్నులదేననుకుంటే - చిత్రం చూస్తుంటే అదికూడా ఇంతే కెపాసిటీ ఉన్నట్టుంది) 7000 టన్నులుండాలి.

 

3. ఈరోజు కథనాలు / మంత్రుల ప్రకటనలు చూస్తుంటే LG పొలిమెర్స్ విశాఖలో మిగిలివున్న ఆ కెమికల్ మొత్తాన్ని 2 వెస్సెల్స్ ద్వారా (ఒకటి 8000 టన్నులు ఇంకొకటి 5000 వేల టన్నుల కారియర్) ద్వారా మొత్తం 13000 టన్నుల కెమికల్ 2 లేదా 3 రోజులలో సౌత్ కొరియా కి తీసుకుపోయే ప్రయత్నాలలో ఉంది. ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు మీడియాతో చెప్పారు.

పై లెక్కల ప్రకారం 3 ట్యాంకులు వున్నాయనుకుంటే ఉండవలసిన 7000 టన్నుల బదులు 13000 టన్నుల కెమికల్ రవాణా ఎలా సాధ్యం?

అసలు ఈలెక్కల మతలబులేమిటి? ఆ ఎక్కువ కెపాసిటీ కెమికల్ ఎక్కడినుంచి వచ్చింది? ఎక్కడ దాచారు?