ఎల్జీ పాలిమర్స్ బీభత్సమైన షాక్ తగిలిందే !

June 01, 2020
CTYPE html>
ఎల్జీ పాలిమర్స్ అరాచక ఆలోచనకు సుప్రీంకోర్టు బ్రేక్ వేయడమే కాదు, ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్‌ఆర్ వెంకటపురంలోని తన ప్లాంట్‌లో గ్యాస్ లీక్‌పై దర్యాప్తు జరిపేందుకు ఎన్జీటీ సహా పలు కేంద్ర సంస్థలు ఏడు కమిటీలను వేసిన సంగతి తెలిసిందే.  అంత ఘోరం జరిగితే ... తన కంపెనీలో దర్యాప్తు చేయొద్దు అంటూ అత్యంత మూర్ఖత్వంతో కూడిన ఒక పిటిషను వేసిన ఎల్జీ పాలిమర్స్ వాదనల్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఏకంగా ఎల్జీ పాలిమర్స్ తన పిటిషన్ లో ఎపి కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, సెంట్రల్ పిసిబి, కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని కోరడం విడ్డూరం.
ఈ విషయాన్ని ఎపి హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే పరిశీలిస్తోందని మీ వాదనలన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) వద్దే వినిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఎల్జీ పాలిమర్స్  ద్వారా జరిగిన వైజాగ్ గ్యాస్ లీక్ పై దర్యాప్తు చేయడానికి ఎన్జిటి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
విశాఖలో పెను ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి చూపకపోయినా ఏపీ హైకోర్టు, ఎన్జీటీ, మానవ హక్కుల కమిషన్ ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. కానీ ఇంత జరుగుతున్నా ఆ కంపెనీని ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ ఒక మాట అన్న పాపాన పోలేదు. ఈరోజు బరితెగించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన ఎల్జీ పాలిమర్స్ కు గట్టి ఎదురు దెబ్బే తగిలింది. 12 మంది మృతి, ఇతర ఆస్తి, జంతు నష్టం, వేలాంది మంది ఆస్పత్రి పాలు కావడం, ఇంకా భవిష్యత్తులో ఊహించని ఎన్నో అనారోగ్యాలకు కారణమైన ఈ కంపెనీ నిర్లక్ష్యం మాటకందనిది. 
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) LG polymers కంపెనీకి చీవాట్లు పెట్టింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు... రూ.50 కోట్లను డిపాజిట్ చేయాలంటూ ఎల్జీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు విషయాలపై తనదైన వాదనను వినిపించేందుకు సిద్ధమైన ఎల్జీ పాలిమర్స్... సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ కోర్టు ఆగ్రహానికి గురైంది.
ప్రమాదంపై విచారణ చేపట్టడానికి ఎన్జీటీకి అర్హత లేదని ఎల్జీ పాలిమర్స్ వితండ వాదం వినిపించింది. 
రూ.50 కోట్లను డిపాజిట్ చేయాలని చెప్పే అధికారం ఏపీ హైకోర్టుకు కూడా లేదని ఆ సంస్థ సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ రెండు కోర్టులో విచారణ ముగిశాకనే తాము విచారణ చేపడతామని, సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది.