సీఎం వచ్చి వెళ్లాక వైజాగ్ లో ఎలా ఉందో తెలుసా?

May 28, 2020

విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించడానికి వైజాగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. అంతకంటే ముందు కంపెనీ వారిని పరామర్శించారు.

ఇక ఆస్పత్రిలో బాధితుల సంగతి పక్కన పెడితే ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజల యోగక్షేమాలను ముఖ్యమంత్రి విస్మరించారు. ఇళ్లు వదిలి జనం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడున్నారు. కరోనా లేకపోయింటే వైజాగ్ లో ఇతర ప్రాంత వాసులు ఆదుకునేవారేమో. కానీ కరోనా వల్ల ఎవరూ రానీయడం లేదు.

బాధిత ప్రాంత ప్రజలకు వసతి కల్పించాల్సిన ప్రభుత్వం దానిని గాలికి వదిలేయడంతో పాపం రోడ్ల మీద ఆత్మాభిమానంతో పడుకోలేక అలాగే రాత్రంతా జాగారం చేశారు. ముఖ్యమంత్రి మాత్రం ఇంటికెళ్లి హాయిగా ఏసీ వేసుకుని పడుకున్నారు. వారి వెతలు ఈ వీడియోలో చూడండి. 

వీడియో లింకు : ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాల ప్రజలు రాత్రంతా ఏం చేశారంటే