YSRCP : ఈ 5 సంచలన ప్రశ్నలకు సమాధానమేదీ?

August 05, 2020

డబ్బులు వెదజల్లి జనాల్ని డైవర్ట్ చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది డబుల్ పీహెచ్ డీ. చర్చను ఎలా దారి మళ్లించాలో తన తండ్రికంటే కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఈ విద్య జగన్ కి తెలుసు అని అంచనా వేయడంలో చంద్రబాబు నిజంగానే విఫలం అయ్యారని చెప్పారు. 

తమాషా ఏంటంటే... జగన్ పదేపదే ఇదే టెక్నిక్ ను వాడినా ప్రతిపక్షాలు జగన్ ట్రాప్ లో పడుతున్నాయి. ఒక్కోసారి ట్రాప్ అని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. ఉదాహరణకు మరణించిన బాధితులకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి అని బీజేపీ డిమాండ్ చేసింది. జగన్ కోటి ఇచ్చాడు. అడిగిన దానికంటే 4 రెట్లు ఇచ్చిన మాయలో జగన్ ని విపరీతంగా పొగిడేశాడు కన్నా లక్ష్మినారాయణ.

జగన్ స్ట్రాటజీ ఏంటో ఎందుకు జగన్ కోటి ఇచ్చాడో అర్థం చేసుకునే లోపు ఆల్రెడీ కన్నా వద్ద రెండో సారి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్షాలే మా సీఎంను పొగిడాయని వైసీపీ ప్రచారం చేసుకుంది. 

కానీ జగన్ ప్రభుత్వం ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పగలదా?

1. ఇంత జరగినా LGPolymers సంస్థ బాధితులకు క్షమాపణ ఎందుకు చెప్పలేదు?

2. నష్ట పరిహారం చెల్లిస్తాం అని ఆ సంస్థ ఎందుకు అనలేదు? 

3. ఎల్జీ పాలిమర్స్ తరఫున జగన్ ఎందుకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు? 

4. ఒక్క మీడియా సంస్థ కూడా ఆ సంస్థ స్పందన కోసం ఎందుకు ప్రయత్నించలేదు?

5. ప్రతి పనికిమాలిన చిన్న విషయాలపైన సిట్ వేసే ముఖ్యమంత్రి 2000 మందిని ఆస్పత్రి పాలు చేసిన సీఐడీ, లేదా సిట్టింగ్ జడ్జి సిట్ వేయకుండా అధికారులతో మాత్రమే దర్యాప్తు కమిటీ ఎందుకు వేశారు?