కేసీఆర్ గుడ్ న్యూస్ లు

August 04, 2020

రేపటి నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రారంభం. అయితే మద్యం ధరలు 11-20 శాతం పెరుగుతాయి.

వీటితో పాటు కింద సడలింపులు ఉన్నాయి

భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు

నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల షాపులు తెరుస్తారు.

ఇసుక మైనింగ్ చేసుకోవచ్చు.

మండల కేంద్రాలు, గ్రామాల్లో అన్ని రకాల షాపులు ఓపెన్. 

మున్సిపాలిటీలో 50 శాతం షాపులు ఓపెన్

పది పరీక్షలకు ఏర్పాట్లు, కోర్టుకు రిక్వెస్టు పెడతాం

20 మందితో పెళ్లికి అనుమతి

50 మందితో అంత్యక్రియలకు అనుమతి

వీటితో పాటు కేంద్రం ఇచ్చిన సడలింపులు అన్నీ ఇస్తారు. రాత్రి పూట 7 నుంచి ఉదయం 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి కర్ఫ్యూ ఉంటుంది. ఇందులో ఏ జోనుకు మినహాయింపు లేదు. 

తెలంగాణలో 1096కు చేరుకున్న కరోనా కేసులు – ఇప్పటివరకు తెలంగాణలో 628 మంది డిశ్చార్జ్ – ప్రస్తుతం యాక్టివ్ కేసులు 439 – ఈ రోజు తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు.. 43 మంది డిశ్చార్జ్ – కరోనాను కంట్రోల్ చేయడంలో వందశాతం సక్సెస్ – దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.37 శాతం.. తెలంగాణలో 2.24 శాతం – ముందు నుంచి పకడ్బందీగా ఉన్నాం – దేశంలో కరీంనగరే మొదటి కంటైన్ మెంట్ జోన్ – కరీంనగర్ లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకున్నాం – దేశానికే రోల్ మోడల్ గా నిలిచాం – కరీంనగర్ నుంచి నేర్చుకొని మిగతా ప్రాంతాల్లో అమలు చేశాం – కరోనా కట్టడికి కృషి చేసిన అధికారులు, నాయకులు, సిబ్బందికి అభినందనలు – రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు – ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం - ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలి – మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో భయంకరంగా చనిపోతున్నారు – భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనాను నియంత్రించుకోగలిగాం – వైద్య సిబ్బందికి కోటి మాస్కుల పంపిణీ చేస్తాం -  హైదరాబాద్, మేడ్చల్, గద్వాల్, వికారాబాద్ సహా మరో రెండు జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి – ఆరెంజ్ జోన్ లో 18 జిల్లాలు, గ్రీన్ జోన్ లో 9 జిల్లాలు – కేంద్రం ఇచ్చిన సడలింపులను అతిక్రమించలేం – మరో ఐదారు జిల్లాలు ఈరోజే గ్రీన్ జోన్ లోకి వెళ్తున్నాయి – వచ్చే 11 రోజుల్లో 18 జిల్లాలు కూడా గ్రీన్ జోన్ లోకి వెళ్తాయి – రాష్ట్రంలో ఇప్పటివరకు 35 కంటైన్ మెంట్ జోన్లు – హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రాజీపడలేం – మొత్తం 29 మంది చనిపోతే 25 మరణాలు ఈ రెండు జిల్లాల్లోనే – ముంబై దుస్థితి మనకు రావొద్దు – చైనా నుంచి చాలా కంపెనీల దృష్టి సౌతిండియా మీద ఉంది – ముఖ్యంగా కంపెనీల దృష్టి హైదరాబాద్ పైనే ఉంది – హైదరాబాద్ ను సేఫ్ గా ఉంచుకోవడం మన బాధ్యత – రాష్ట్రం మొత్తం కరోనా ఫ్రీగా మారుతోంది – రాత్రి కర్ఫ్యూ ఉంటుంది – ఎన్టీవీ సర్వేలో కూడా ప్రజలు లాక్ డౌన్ ను కొనసాగించాలని కోరుకున్నారు -  మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు – ఇంకొన్నాళ్లు ఓపికపడితే కరోనాను పూర్తిగా జ యించగలం – 65 ఏళ్లు దాటినవారు బయటకు రాకుండా చూడాలి – గృహ నిర్మాణాలకు సంబంధిత దుకాణాలు తెరుచుకుంటాయి – ఎలక్ట్రికల్, హార్డ్ వేర్ షాపులు కూడా తెరుచుకుంటాయి – జోన్ ల వారీగా కేంద్రం మార్గదర్శకాలను యథాతథంగా అమలు చేస్తాం – వ్యవసాయ పనులు, దానికి సంబంధించిన దుకాణాలకు అనుమతి – హైదరాబాద్ విషయంలో గత్యంతరం లేదు – మే 15న రివ్యూ సమావేశం – దేశంలో నగరాల పరిస్థితిపై చర్చిస్తాం – గ్రీన్ జోన్ లు, ఆరెంజ్ జోన్ లో సడలింపులు ఇస్తున్నాం – 27 జిల్లాల్లో అన్ని షాపులు నడుస్తాయి – మండల కేంద్రం, గ్రామాల్లో అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చు – ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు దుకాణాలు తెరుచుకుంటాయి – పట్టణాల్లో లాటరీ పద్ధతిలో దుకాణాలు తెరుచుకుంటాయి -  రాష్ట్ర వ్యాప్తంగా జోన్లతో సంబంధం లేకుండా రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుంది – స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ పనిచేస్తుంది – రేపట్నుంచి భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చేసుకోవచ్చు – ఆర్టీఏ ఆఫీసులు కూడా పనిచేస్తాయి – మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం – ఒక్కో హాల్లో 20మంది విద్యార్థులు ఉండేలా పరీక్షలు – కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పదో తరగతి పరీక్షలు – ఇది రేపో ఎల్లుండో సమసిపోయే సమస్యకాదు – కరోనాతో కలిసి బతకాల్సిందే – ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తి చేస్తాం – లాయర్ల కోసం 22 కోట్ల ఆర్థిక సాయం – వలస కూలీలను ఆదుకుంటాం – ఇక్కడే ఉండి పనిచేయాలనుకునే వారికి అండగా ఉంటాం – తెలంగాణలో జరుగుతుంది రైతు రాజ్యం – దేశ చరిత్రలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ – మద్ధతు ధర ఇచ్చి వాళ్ల దగ్గరకే వెళ్లి పంటను కొన్నాం – దేశంలో ఏ రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు – రైతులు కూడా సంమయనం పాటించాలి – రైతులను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో వందశాతం ధాన్యం కొంటున్నాం – అన్ని పంటలను ఏక మొత్తంగా కొన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే – కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు మద్దతు ధర పేరుతో మోసం చేశారు – ఛత్తీస్‌గఢ్‌లో పంట కొనుగోలు చేయక.. రైతులు భూపాలపల్లికి వస్తున్నారు – కాంగ్రెస్ వాళ్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు – రైతు బంధు అందరికీ వందశాతం ఇస్తాం – కేసీఆర్ బతికున్నంతకాలం రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుంది - రుణమాఫీ రూ.1200 కోట్లు రేపే విడుదల చేస్తున్నాం – ఐదున్నర లక్షల మంది రైతుల రుణం మాఫీ – రూ.25 వేల లోపు ఉన్నవారికి రేపే రుణమాఫీ - పింఛన్ల విషయంలో రాజీపడం – రైతులకు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి – రైతులకు లేని కంగారు కాంగ్రెస్ నేతలకే ఉంది – కాంగ్రెస్ వాళ్లకు ఏ విషయం, ఎప్పుడు ఎత్తుకోవాలో కూడా తెలియదు – చత్తీస్‌గఢ్‌లో మాటిచ్చారు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు – అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా.. మరి ఎందుకు అడగరు – ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి.. లేదంటే ప్రజలు చూసి నవ్వుతారు – పిచ్చిపనులు చేసుకొని అభాసుపాలు కావొద్దు -తెలంగాణ పల్లెలు ఆర్థికంగా బలం కావాలే – తెలంగాణను గుడుంబారహిత రాష్ట్రంగా మార్చాం – కేంద్రం ఇచ్చిన సడలింపులతో 4 రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయి – ఏపీ, మహారాష్ట్రతో సుధీర్ఘ సరిహద్దు ఉంది – ఈ నాలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచారు – ఈ బార్డర్ గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్లి మద్యం తాగుతున్నారు – రెడ్ జోన్ జిల్లాలో కూడా మద్యం షాపులు తెరుస్తారు – మద్యం దుకాణాలు తెరావాలని క్యాబినెట్ నిర్ణయించింది – 11 కంటైన్‌మెంట్ జోన్‌లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు – చీప్ లిక్కర్ పై మాత్రం 11 శాతం పెంపు - మద్యం రేటు 16 శాతం పెంపు – బార్ లు, పబ్ లు, క్లబ్ లకు అనుమతి లేదు – భౌతిక దూరం పాటించకపోతే క్షణాల్లో షాప్ సీజ్ - రాను రాను మద్యం స్మగ్లింగ్ తయారవుతుంది – మాస్కులు లేకపోతే మద్యం ఇవ్వరు – లాక్ డౌన్ తర్వాత కూడా ఇవే రేట్లు కొనసాగుతాయి – కేసుల సంగతి ఆరోగ్య శాఖ చూసుకుంటుంది – ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు అమ్మకాలు – అదో ఆల్ పార్టీ, అసలు పార్టీలు ఉన్నాయా? – ప్రజలే మిమ్మల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు – అసెంబ్లీలో ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే పారిపోయారు – కాళేశ్వరం వల్ల ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ఆర్నెళ్లు తడారకుండా పారింది – ఇవి పార్టీలా..? సంస్కారం లేని వాళ్లతో చర్చలా..? – బ్యాలెట్ పత్రాలతో నిర్వహించిన ఎన్నికల్లోనూ ఓడిపోయారు – వలస కూలీలకు రైల్వే చార్జీలు ఇచ్చే డబ్బు కేంద్రం వద్ద లేదా – డబ్బులు వసూలు చేసేందుకు ఇదే సమయమా? – ఒక్క తెలంగాణే కాదు .. అన్ని రాష్ట్రాలు అడిగాయి – కేంద్రం నుంచి ఉలుకు-పలుకు లేకపోతే ఎలా? – FRBMను పెంచాల్సిందిగా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానిని కోరాను – ఇంత చిన్నపని కూడా కేంద్రం చేయకపోవడం దారుణం – రాష్ట్రాలకు ERCలను నియమించే అధికారాన్ని తొలగించేందుకు బిల్లు తేబోతున్నారు – పార్లమెంటులో బిల్లును మేం వ్యతిరేకిస్తాం – కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదు – ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా ఆర్బీఐ రుణాలు వసలు చేస్తోంది.. 2 వేల 500 కోట్లు వసూలు చేసింది