ఎల్జీ పాలిమర్స్ వద్ద మెరుపు ధర్నా

August 06, 2020

ఆర్.ఆర్. వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద స్థానికులు మెరుపు ధర్నాకు దిగారు. ఈ కంపెనీ వెదజల్లిన విషయవాయువు వల్ల 5 గ్రాామాలు దెబ్బతిన్నాయి. అంయితే కంపెనీ నెలకొని ఉన్న వెంకటాపురం వాసులకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో స్థానికులు సర్వం కోల్పోయినా మాకు ప్రభుత్వం చేసిన న్యాయం సరిగాలేదు. మేము తీవ్రంగా నష్టపోయాం. 

ఈ ప్రళయాన్ని సృష్టించిన ఎల్జీపాలిమర్స్ మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు ధ్వజమెత్తారు. పెద్ద సంఖ్యలో స్తానికులు తరలిరావడంతో అక్కడున్న పోలీసులు వారిని అదుపుచేయలేకపోయారు. మాకు పూర్తి న్యాయం చేయాల్సిందే అని వెంకటాపురం గ్రామస్థులు ధర్నాకు దిగారు. 

వాస్తవానికి స్థానికులు ఆ కంపెనీపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడం, కేసులు పెట్టకపోవడంపై ఎక్కువ సీరియస్ గా ఉంది. మమ్మల్నింత నాశనం చేసిన కంపెనీని ఇలా ఊరికే వదిలేస్తారా? వారికి శిక్ష వేయరా? అంటూ స్థానికులు మండిపడుతున్నారు. 12 మంది ప్రాణాలు తీసి, వేలాది మంది రోగాల పాలు చేసిన కంపెనీ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే తమకు జరగాల్సిన న్యాయం కన్నా కంపెనీకి శిక్ష పడాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు.