GOOD NEWS: లాక్ డౌన్లో మందు, క్యాబులుంటాయట !!

August 15, 2020

లాక్ డౌన్లో మోస్ట్ ఎలిజిబుల్ డిమాండ్... వైన్స్ ! ఆశ్చర్యకరంగా దానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే... అది రెడ్ జోన్లలో మాత్రం ఉండదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లకు వేర్వేరు నిబంధనలు పెట్టింది కేంద్రం. కొన్నింటిని మాత్రం ఏ జోన్లోను అనుమతించలేదు. అంటే... రెడ్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ అంటే సరిగా మాట వినరు అని గ్రహించిన కేంద్రం... సడలింపులతో కూడిన లాక్ డౌన్ కే మొగ్గు చూపింది. అయితే... కొన్నిటిని మాత్రం 17వరకు పూర్తిగా నిషేధించింది.  వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలిస్తారు. కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మారుస్తారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రం అన్ని జోన్లలో కర్ఫ్యూ ఉంటుంది. సడలింపులు ఉండవు.

అన్నిచోట్లా నిషేధించిన సేవలు

► విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం

► స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌

► హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌

► స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి

► అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు

 

అన్ని జోన్లలో అనుమతించిన సేవలు

► ఆస్పత్రిలో ఓపీ సేవలు

► వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి  

 

ఇతర సడలింపులు ఇదిగో

► గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి.
► మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించకుండా ఉండాలి.  

► గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి

► గ్రీన్ జోన్లలో రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం

► గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు అన్ని వ్యాపారాలకు అనుమతి

► ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు మాత్రమే అనుమతి

► ఆరెంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి

► ఆరెంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి

► ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు 

► గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి

► 33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి

►  అన్ని రకాల గూడ్స్ , కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి.

► బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే.

► పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు.