లాక్ డౌన్ 4 లో సడలింపుల లిస్టు ఇదిగో?

August 06, 2020

లాక్ డౌన్ మే 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కొన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యమైన పరిణామం ఏంటంటే... ఇంతవరకు జోన్లను కేంద్రం నిర్ణయించేది. ఇక నుంచి రాష్ట్రాలే జోన్లను నిర్ణయిస్తాయి.

ఏమేం అనుమతించారు...?

1. హోం డెలివరీ కిచెన్లకు అనుమతి

2. ఆయా ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని అంతర్రాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు.

3. 50 మందితో పెళ్లికి ఇంత కు ముందుకు అనుమతి ఇచ్చిన దాంట్లో ఎటువంటి మార్పు లేదు.

4. ప్రైవేటు వాహనాలను అనమతించాలా వద్దా అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం. 

5. సెలూన్లు, బార్బర్ షాపులు

6. చిన్న దుకాణాలు స్థానిక నిబంధనలకు లోబడి ఓపెన్ చేయొచ్చు.

7. ఈకామర్స్ వ్యాపారాలు

8. ఓలా ఉబెర్ క్యాబ్స్, ఆటో, సైకిల్ రిక్షా