లాక్ డౌన్ పొడగింపు... సడలింపు లిస్టులో థియేటర్లు

August 11, 2020

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ 5.0 ఏకంగా నాలుగు వారాల పాటు అంటే 30 రోజులు పాటు పొడగించింది. అదే సమయంలో మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో దశల వారిగా సడలింపులు ఉంటాయి.

ఈ లాక్ డౌన్ ప్రకటనే చాలా విచిత్రంగా ఉంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ జూన్ 30 వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అంటే మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ లేదు అన్న అర్థం వచ్చేలా ఈ ప్రకటన ఉంది. కానీ లాక్ డౌన్ లో బంద్ చేసినవి దశల వారిగా తిరిగి ప్రారంభించే ప్రణాళికను ప్రభుత్వం రచిస్తోంది.

రాత్రి పూట కర్ఫ్యూ టైంను కూడా తగ్గించారు. ఇప్పటివరకు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉండేది. జూన్ 1 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ ఉంటుంది.

మొదటి దశలో... జూన్ 8 నుంచి

అన్ని రకాల ప్రార్థనా స్థలాలు ప్రారంభిస్తారు. హాస్పిటాలిటీ సర్వీసులు అంటే హోటళ్లు, రిసార్టులు, లాడ్జిలు వంటివి. రెస్టారెంట్లను కూడా ప్రారంభించుకోవచ్చు.

రెండో దశలో... జులై నుంచి

విద్యాసంస్థలు ప్రారంభిస్తారు. అయితే... ఇంకా దీనిపై చర్చ జరగాల్సి ఉంది. ఫైనల్ నిర్ణయం కాదు.

మూడో దశలో ....

థియేటర్లు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు, జిమ్, సభలు, సమావేశాలు ప్రారంభిస్తారు. వీటికి తేదీలు ఖరారుచేయలేదు. 

Image